HomeUncategorizedBhargavastra | దేశీయంగా రూపొందిన మరో అస్త్రం.. 'భార్గవాస్త్ర' ప్రయోగం విజయవంతం

Bhargavastra | దేశీయంగా రూపొందిన మరో అస్త్రం.. ‘భార్గవాస్త్ర’ ప్రయోగం విజయవంతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bhargavastra | భారత అమ్ములపొదిలోకి త్వరలో మరో అస్త్రం చేరనుంది. ఇందులో భాగంగా సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) అభివృద్ధి చేసిన ‘భార్గవాస్త్ర’ ప్రయోగం విజయవంతమైంది. తక్కువ ఖర్చుతో కూడిన ‘భార్గవాస్త్ర’ (Bhargavastra) అనేది కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. దీని ద్వారా డ్రోన్ దాడులను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. దీనిని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారుల సమక్షంలో గోపాల్‌పూర్‌లో బుధవారం పరీక్షించారు. రెండు ట్రయల్స్‌లో ఒక్కొక్క రాకెట్‌ను ప్రయోగించారు. మూడో ట్రయల్‌లో సాల్వో మోడ్ లాంచ్(Salvo mode launch) ప్రదర్శించారు. కేవలం 2 సెకన్లలోపు రెండు రాకెట్లను ప్రయోగించడం గమనార్హం. ఆధునిక యుద్ధంలో డ్రోన్ ప్రాముఖ్యత పెరిగిన వేళ వీటి ముప్పును ఎదుర్కొనేందుకు దీనిని రూపొందించారు.

Bhargavastra | 2.5 కి.మీ. దూరంలోని డ్రోన్లను నాశనం చేసే సామర్థ్యం

2.5 కిలోమీటర్ల దూరంలోని చిన్న డ్రోన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం భార్గవాస్త్ర సొంతం. ఇది మొదటి స్థాయి రక్షణగా 20 మీటర్ల రేడియస్‌తో డ్రోన్ సమూహాలను, అన్‌గైడెడ్ మైక్రో రాకెట్లను(Unguided micro rockets) నాశనం చేస్తుంది. రెండో స్థాయి రక్షణగా గైడెడ్ మైక్రో-క్షిపణి(Guided micro-missile)ని ఉపయోగిస్తుంది. ఇది టార్గెట్లను ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తుంది.