అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gujarat Kidney IPO | వచ్చేవారంలో మెయిన్బోర్డ్నుంచి ఒకే ఒక్క కంపెనీ ఐపీవోకు వస్తోంది. ఆస్పత్రులను నిర్వహించే గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ లిమిటెడ్ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 250 కోట్లు సమీకరించనుంది.
గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ (Gujarat Kidney, Super Speciality) లిమిటెడ్‌ను 2019లో స్థాపించారు. మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ సేవలను అందించే ప్రముఖ కంపెనీలలో ఇది ఒకటి. ఈ కంపెనీకి గుజరాత్(Gujarat) అంతటా బహుళ ఆస్పత్రులు ఉన్నాయి. దీని ప్రధాన సేవలలో సెకండరీ కేర్ సర్వీసెస్ మరియు టెర్షియరీ కేర్ సర్వీసెస్ ఉన్నాయి. మినిమల్లీ ఇన్వాసివ్ ప్రొసీజర్స్, ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ట్రామా ట్రీట్మెంట్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ప్రసూతి, గైనకాలజీ, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, నాన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, డయాబెటాలజీ, అనస్థీషియాలజీ వంటి సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ 7 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, నాలుగు ఫార్మసీలను నిర్వహిస్తోంది.
Gujarat Kidney IPO | రూ. 250.80 కోట్లు సమీకరించేందుకు..
ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 250.80 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు (IPO) వస్తోంది. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ(Fresh issue). పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను ఆస్పత్రుల కొనుగోలు, నూతన ఆస్పత్రుల ఏర్పాటు, అనుబంధ సంస్థలలో వాటా పెంచుకోవడం, రోబోటిక్స్ పరికరాల కొనుగోలు తదితర అవసరాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Gujarat Kidney IPO | ధరల శ్రేణి..
కంపెనీ ధరల శ్రేణిని (Price band) రూ. 108 నుంచి రూ. 114 గా నిర్ణయించింది. ఒక లాట్లో 128 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,592తో బిడ్ వేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు బిడ్ వేయవచ్చు. హెచ్ఎన్ఐలు కనీసం 14 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Gujarat Kidney IPO | ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్స్క్రిప్షన్ (Subscription) ఈనెల 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. షేర్ల అలాట్మెంట్ స్టేటస్ 26న రాత్రి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 30న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టవుతాయి.
Gujarat Kidney IPO | కోటా, జీఎంపీ..
ఈ పబ్లిక్ ఇష్యూలో క్యూఐబీలకు 75 శాతం, హెచ్ఎన్ఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు (Retail investors) 10 శాతం కోటా కేటాయించారు. ఒక్కో ఈక్విటీ షేరుకు జీఎంపీ రూ. 7 గా ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 6 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Gujarat Kidney IPO | ఆర్థిక పరిస్థితి..
కంపనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.48 కోట్ల ఆదాయం ద్వారా రూ. 1.71 కోట్ల ప్యాట్ జనరేట్ కాగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ (Revenue) రూ. 40.40 కోట్లకు, ప్యాట్ రూ. 9.50 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో కంపెనీ ఆస్తులు రూ. 20.53 కోట్లనుంచి రూ. 55.34 కోట్లకు చేరాయి.