అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. అక్కడ మైనారిటీలే లక్ష్యంగా కొందరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.
బంగ్లాదేశ్‌లో (Bangladesh) కొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందువులపై దాడులు చేస్తున్నారు. తాజాగా జషోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో (Manirampur) ఒక హిందూ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సంఘటన తర్వాత మొత్తం ప్రాంతంలో భయానక వాతావరణం, ఉద్రిక్తత నెలకొంది.
Bangladesh | అక్కడికక్కడే మృతి
సోమవారం సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతుడిని కేశబ్‌పూర్ ఉప జిల్లాలోని అరువా గ్రామానికి చెందిన 45 ఏళ్ల రాణా ప్రతాప్ బైరాగిగా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు అకస్మాత్తుగా అతనిపై కాల్పులు జరిపినప్పుడు రాణా ప్రతాప్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న మణిరాంపూర్ పోలీసులు (Manirampur police) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి చేసిన వారిని గుర్తించడానికి చర్యలు చేపట్టారు.
Bangladesh | 18 రోజుల్లో ఐదో హత్య
బంగ్లాదేశ్‌లో 18 రోజుల్లో ఐదుగురు హిందువులు హత్యకు గురయ్యారు. గతంలో, దీపు చంద్ర దాస్, అమృత్ మండల్, బజేంద్ర విశ్వాస్, వ్యాపారవేత్త ఖోకన్ దాస్‌లను కూడా కొట్టి చంపడం లేదా కాల్చి చంపడం చేశారు. ఈ ఘటనలు బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రత గురించి ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం దాడులను ఆపడంలో విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.