అక్షరటుడే, వెబ్‌డెస్క్:Saudi Airlines | అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad plane crash) ఘటన మరువక ముందే దేశంలో వరుస సంఘటనలు కలవరపెడుతున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 274 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లక్నోలో సౌదీ విమానానికి ప్రమాదం తప్పింది.
Saudi Airlines | టైర్ నుంచి పొగలు
సౌదీ ఎయిర్‌లైన్స్(Saudi Airlines)కు చెందిన విమానం హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి ఆదివారం ఉదయం ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని లక్నోకు వచ్చింది. ల్యాండింగ్ సమయలో ల్యాండింగ్ గేర్ నుంచి నిప్పు కణికలు వచ్చాయి. గమనించిన సిబ్బంది ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులను దించేశారు. ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించి ఆర్పివేశారు. ఆ సమయంలో విమానంలో 250 మంది హజ్ యాత్రికులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది మరణించారు. అలాగే ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel) భవనంపై కూలడంతో అందులోని 33 మంది మెడికోలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలోకి చికిత్స పొందుతున్నారు. కాగా.. ఆదివారం యూపీలోని ఘజియాబాద్‌లో కోల్‌కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. మరోవైపు కేదార్‌నాథ్‌కు యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి చెందారు. దేశంలో వరుస ఘటనలో విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.