అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్(Hyderabad) నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల నగర శివారులోని పాశమైలారం (PashaMailaram)లో సిగాచి కంపెనీలో పేలుడు చోటుచేసుకొని 40 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి(Mailardevpalli) కాటేదాన్ పారిశ్రామిక వార్డులో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రబ్బర్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ (SR Nagar Police Station) పరిధిలోని కాఫీ డే, క్రిష్ ఇన్ హోటల్ కిచెన్‌లో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చేలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో భయంతో అక్కడి నుంచి ప్రజలు పరుగులు తీశారు. అయితే పొగ అలుముకోవడంతో.. పైఅంతస్తులో కొందరు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.