More
    HomeజాతీయంJharkhand | జార్ఖండ్‌లో మ‌రో ఎన్‌కౌంట‌ర్.. కేంద్ర క‌మిటీ స‌భ్యుడు స‌హా ముగ్గురు హ‌తం

    Jharkhand | జార్ఖండ్‌లో మ‌రో ఎన్‌కౌంట‌ర్.. కేంద్ర క‌మిటీ స‌భ్యుడు స‌హా ముగ్గురు హ‌తం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jharkhand | మావోయిస్టుల‌కు మరోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. జార్ఖండ్‌లో (Jharkhand) జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు స‌హా ముగ్గురు మావోలు హ‌త‌మ‌య్యారు.

    హజారీబాగ్ జిల్లాలో (Hazaribagh district) సోమవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో స‌హాదేవ్ సోరెన్ మృతి చెందాడు. మావోయిస్టు కేంద్ర క‌మిటీ (Maoist central committee) స‌భ్యుడు అయిన ఆయన త‌ల‌పై రూ.కోటి రివార్డు ఉంది. సోరెన్‌తో మరో ఇద్ద‌రు హ‌త‌మ‌య్యారు. గోర్హార్ పోలీస్ స్టేషన్ (Gorhar police station) పరిధిలోని పంతిత్రి అడవిలో సోరెన్ దళానికి. భద్రతా దళానికి మధ్య ఉదయం 6 గంటల ప్రాంతంలో కాల్పులు జ‌రిగాయ‌ని పోలీసులు తెలిపారు.

    Jharkhand | కొన‌సాగుతున్న వేట‌..

    పంతిత్రి అట‌వీప్రాంతంలో మావోల క‌ద‌లిక‌ల‌పై స‌మాచారం అందుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వ‌హించాయి. ఈ క్ర‌మంలో తార‌స‌ప‌డిన మావోలు ఫైరింగ్ ప్రారంభించ‌గా, పోలీసులు ఎదురుకాల్పులు జ‌రిపారు. ఈ క్ర‌మంలో స‌హాదేవ్ స‌హా ముగ్గురు మృతి చెందార‌ని పోలీసులు తెలిపారు. త‌ప్పించుకు పోయిన మిగ‌తా కోసం గాలింపు కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఇరువైపులా కాల్పులు ఆగిపోయిన అనంత‌రం ఘ‌టనా స్థ‌లానికి వెళ్లి చూడ‌గా మూడు మృత‌దేహాలు ల‌భించాయ‌న్నారు. రూ. కోటి రివార్డు ఉన్న సహ్‌దేవ్ సోరెన్ (Sahdev Soren), మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

    Jharkhand | కేంద్ర రాష్ట్ర బ‌ల‌గాల నేతృత్వంలో..

    తాజాగా జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో కేంద్ర‌, రాష్ట్ర ద‌ళాలు (central and state forces) పాల్గొన్నాయి. “కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు నక్సల్స్‌ను మట్టుబెట్టి, మూడు AK-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో హతమైన వారిలో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సహదేవ్ సోరెన్ (ఆయ‌న త‌ల‌పై రూ. కోటి రివార్డు ఉంది), స్పెష‌ల్ ఏరియా క‌మిటీ స‌భ్యుడు రఘునాథ్ హెంబ్రామ్ (ఆయ‌న త‌ల‌పై రూ. 25 లక్షల రివార్డు ఉంది), జోన‌ల్ ఏరియా క‌మిటీ విర్సేన్ గంజు (రూ. 10 లక్షల రివార్డు) ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున హజారీబాగ్‌లోని గోర్హార్ ప్రాంతంలోని పంటిత్రి అడవిలో ఈ ఆపరేషన్ జరిగింది” అని CRPF ఒక ప్రకటనలో తెలిపింది.

    Jharkhand | భ‌ద్ర‌తా ద‌ళాల‌కు భారీ విజ‌యాలు..

    సీఆర్పీఎఫ్‌, రాష్ట్ర ప్ర‌త్యేక ద‌ళాలు ఈ సంవ‌త్స‌రంలో భారీ విజ‌యాలు న‌మోదు చేశాయి. 209 కోబ్రా పరాక్రమ దళాలు నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో మంచి ప్ర‌తిభ చూపాయి. ఇప్ప‌టిదాకా ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఇద్దరు BJSAC సభ్యులు, నలుగురు జోనల్ కమిటీ సభ్యులు (ZCMలు), ఇద్దరు సబ్-జోనల్ కమిటీ సభ్యులు (SZCMలు), ముగ్గురు ఏరియా కమిటీ సభ్యులు (ACMలు), ఇత‌ర నక్సల్ క్యాడర్‌ సహా 20 మంది హార్డ్‌కోర్ నక్సల్స్‌ను హ‌త‌మార్చాయి. అలాగే, 32 అధునాతన ఆటోమేటిక్ ఆయుధాలు, 345 కిలోల పేలుడు పదార్థాలు, 88 డిటోనేటర్లు, 2500 లైవ్ మందుగుండు సామగ్రి, పెద్ద మొత్తంలో పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నాయి.

    More like this

    India vs Pakistan | పాక్ ఆట‌గాళ్ల‌కు ప‌రాభవం.. మ్యాచ్ త‌ర్వాత‌ క‌ర‌చాలనం చేయ‌ని క్రికెట‌ర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs Pakistan | పాకిస్తాన్‌కు తీవ్ర ప‌రాభ‌వం ఎదురైంది. ఉగ్ర‌వాదులు ఎగ‌దోస్తున్న దాయాది...

    Guest lecturers | అతిథి అధ్యాపకులకు వేతన వెతలు..!

    అక్షరటుడే, కమ్మర్‌పల్లి: Guest lecturers | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో (government junior colleges) పనిచేస్తున్న అతిథి...

    Maharashtra Governor | మహారాష్ట్ర గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య దేవవ్రత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra Governor | మహారాష్ట్ర గవర్నర్​గా ఆచార్య దేవవ్రత్ (Acharya Devavrat) సోమవారం అదనపు...