HomeజాతీయంChhattisgarh | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ముగ్గురు మావోయిస్టుల మృతి

Chhattisgarh | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు నక్సల్స్​ హతం అయ్యారు. ఇటీవల వరుస ఎన్​కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతి చెందుతుండటంతో పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

సుక్మా జిల్లాలో (Sukma district) కొబ్రా, డీఆర్జీ, జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్​ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. భేజ్జీ, చింతగుఫా పోలీస్ స్టేషన్ (Chintagufa police station) ప్రాంతాల అటవీ కొండలలో ఉదయం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం మావోయిస్టుల వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు కాల్పులు జరిగాయి అని పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. ఇప్పటివరకు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని చెప్పారు.

Chhattisgarh | 262 మంది మృతి

దేశంలో 2026 మార్చి వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) చేపట్టింది. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మావోలను చుట్టుముడుతున్నాయి. దీంతో భారీగా మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్​కౌంటర్లలో 262 మంది మావోయిస్టులు మరణించారు. మరోవైపు ఆపరేషన్​ కగార్​ ధాటికి తట్టుకోలేక పలువురు నక్సల్స్​ లొంగిపోతున్నారు. కీలక నేతలు సైతం అడవులను వీడి జనంబాట పడుతున్నారు. దీంతో మావోయిస్ట్​ పార్టీ బలహీనం అవుతోంది.

Must Read
Related News