HomeజాతీయంChhattisgarh | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ఆరుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బీజాపూర్​ జిల్లాలోని నేషనల్​ పార్క్​లో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. మహారాష్ట్ర సరిహద్దులో గల బీజాపూర్​ జిల్లాలోని (Bijapur district) నేషనల్‌ పార్కు అడవుల్లో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్​ మృతి చెందినట్లు ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ (SP Jitendra Kumar Yadav) తెలిపారు.

బీజాపూర్, గడ్చిరోలి జిల్లాల సమీపంలోని దట్టమైన అడవులలో మంగళవారం ఉదయం నుంచి భీకర కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా రిజర్వ్ గార్డ్స్ (District Reserve Guards), కోబ్రా కమాండోలు, స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్​ చేపట్టాయి. మోదక్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవిలోని (Indravati National Park forest) కందుల్నార్‌కు పశ్చిమాన ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన ప్రాంతాలలో ఈ ఉదయం కాల్పులు జరిగాయి. మావోయిస్టు కీలక నేతలు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.

Chhattisgarh | ఆయుధాలు స్వాధీనం

కాల్పుల తర్వాత ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల గుర్తింపులను నిర్ధారిస్తున్నామని అధికారులు తెలిపారు. పలు ఆయుధాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతోంది. నవంబర్ 5-6 తేదీలలో బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో (Bijapur-Telangana border) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ఎన్​కౌంటర్లతో మావోయిస్టులు కలవర పడుతున్నారు. ఆపరేషన్​ కగార్​తో బలగాలు అడవుల్లోకి చొచ్చుకువెళ్తున్నాయి. దీంతో భారీ సంఖ్యలో నక్సల్స్​ ఎన్​కౌంటర్లలో చనిపోతున్నారు.

Must Read
Related News