ePaper
More
    HomeజాతీయంEncounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ఆరుగురు మావోల హతం

    Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ఆరుగురు మావోల హతం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | భద్రతా బలగాలు (Security Forces) మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిత్యం కూంబింగ్​ చేపడుతూ.. దట్టమైన అటవీ ప్రాంతాలను సైతం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో వరుస ఎన్​కౌంటర్లు (Encounters) చేసుకుంటుండగా.. భారీ సంఖ్యలో మావోలు మృతి చెందుతున్నారు. తాజాగా ఛత్తీస్​గఢ్​లోని నారాయణపూర్ (Narayanapur)​ జిల్లాలో ఎన్​కౌంటర్ చోటు చేసుకుంది.

    Encounter | అబూజ్‌మడ్‌ అడవుల్లో..

    నారాయణపూర్​ జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో నక్సల్స్​ ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ నిర్వహించాయి. ఈ క్రమంలో శుక్రవాం జరిగిన ఎన్​కౌంటర్​లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌ సహా పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

    READ ALSO  Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

    Encounter | ఆపరేషన్​ కగార్​తో కంగారు..

    దేశంలో 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​ చేపట్టింది. ఈ ఆపరేషన్​లో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఒకప్పుడు మావోలకు కంచు కోటగా ఉన్న ప్రాంతాలను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయి. దీంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఎన్​కౌంటర్లలో భారీగా కేడర్​ కోల్పోవడంతో పాటు.. కీలక నేతలు హతం అవుతుండటంతో కలవరం చెందుతున్నారు. ఈ క్రమంలో తాము చర్చలకు సిద్ధమని.. కేంద్ర ఆపరేషన్​ కగార్​ ఆపాలని వారు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం చర్చల్లేవని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడి లొంగిపోవడమే మావోయిస్టుల ముందు ఉన్న మార్గమని ఇటీవల అమిత్​ షా అన్నారు.

    READ ALSO  Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    Latest articles

    Flight Missing | రష్యాలో విమానం మిస్సింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Flight Missing | రష్యాలో విమానం మిస్​ అయింది. అంగారా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines Plane)...

    Anil Ambani | అనిల్​ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త అనిల్​ అంబానీకి ఈడీ అధికారులు(ED Officers) షాక్​ ఇచ్చారు....

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(global markets) పాజిటివ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం...

    Thailand AIR Strikes | మరో యుద్ధం తప్పదా.. కంబోడియాపై థాయిలాండ్​ వైమానిక దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand AIR Strikes | కంబోడియాలోని సైనిక స్థావరాలపై థాయిలాండ్​ గురువారం వైమానిక దాడులకు దిగింది....

    More like this