అక్షరటుడే, వెబ్డెస్క్ : Chhattisgarh Encounter | మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోలు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా (Bijapur District) మరికెళ్ల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
మరికెళ్ల అడవుల్లో (Marikela Forest) మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బుధవారం బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఎన్ కౌంటర్ చోటు చేసుకోగా.. ముగ్గురు నక్సల్స్ చనిపోయారు. మిగతా వారి కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ (Search Operation) కొనసాగించాయి. ఈ క్రమంలో గురువారం మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్ను తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు పర్యవేక్షించారు.
Chhattisgarh Encounter | వరుస ఘటనలతో ఆందోళన
దేశంలో 2026 మార్చి 31 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పలుమార్లు మావోయిస్టులను హెచ్చరించారు. ఆయుధాలు వీడాలని సూచించారు. మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. కేంద్ర బలగాలు, ఆయా రాష్ట్రాల్లోని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మావోయిస్టు ప్రాంతాల్లో కూంబింగ్ చేపడుతున్నాయి. ఆధునిక సాంకేతికను ఉపయోగించి అడవుల్లోకి చొచ్చుకు వెళ్తున్నాయి. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతాలను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న ఎన్కౌంటర్లలో వందలాది మంది చనిపోయారు. దీంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.
Chhattisgarh Encounter | లొంగుబాట్లు
ఎన్కౌంటర్లతో పాటు లొంగుబాట్లు మావోయిస్టు పార్టీ (Maoist Party)ని కలవర పెడుతున్నాయి. ప్రస్తుతం కొత్తగా రిక్రూట్మెంట్లు లేవు. దీనికి తోడు మావోయిస్టు పార్టీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో కేంద్ర బలగాలు చొచ్చుకు వస్తుండటంతో చాలా మంది ఆయుధాలు వీడి లొంగిపోతున్నారు. అడవులను వీడి జనం బాట పడుతున్నారు. దీంతో పార్టీ మరింత బలహీనంగా మారుతోంది.
