అక్షరటుడే, వెబ్డెస్క్: Encounter | ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం మావోయిస్టులు(Maoists), భద్రతా బలగాలకు (Security Forces) మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు. ఇంద్రావతి నేషనల్ పార్క్ (Indravati National Park) అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Encounter | వరుస ఘటనలతో షాక్
వరుస ఎన్కౌంటర్లతో (Encounters) మావోయిస్టులు కుదేలవుతున్నారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఇది వరకే ప్రకటించారు. వానాకాలంలో ప్రతి ఏడాది నక్సల్స్ రెస్ట్ తీసుకుంటారని.. కానీ ఈ సంవత్సరం వారికి రెస్ట్ లేకుండా చేస్తామన్నారు. ఈ మేరకు ఆపరేషన్ కగార్(Operation Kagar) కొనసాగిస్తున్నారు. తాజాగా శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) సైతం నక్సల్స్ రహిత దేశాన్ని నిర్మిస్తామన్నారు. ఈ క్రమంలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజాపూర్ జిల్లా(Bijapur District)లో ఎన్కౌంటర్ చోటు చేసుకోగా ఒక మావోయిస్ట్ మృతి చెందాడు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.