ePaper
More
    HomeజాతీయంEncounter | బీజాపూర్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

    Encounter | బీజాపూర్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Encounter | ఛత్తీస్​గఢ్​(Chhattisgarh) రాష్ట్రంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల సెర్చ్​ ఆపరేషన్(Search operation)​ కొనసాగుతోంది. బీజాపూర్​ జిల్లాలోని నేషనల్​ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు మూడు రోజులుగా కూంబింగ్(Coombing)​ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు.

    శనివారం మళ్లీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకోగా.. ఐదుగురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్​లో భాగంగా తొలిరోజు మావోయిస్ట్​ కీలక నేత ఏపీకి చెందిన సుధాకర్​ మృతి చెందాడు. శుక్రవారం తెలంగాణలోని ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన మరో అగ్రనేత భాస్కర్​ ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. శనివారం ఉదయం ఇద్దరు కీలక నేతలు హతం అయ్యారు. తాజాగా మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది విధులు...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...