Homeఆంధప్రదేశ్Encounter in AP | ఏపీలో మరో ఎన్​కౌంటర్​.. ఏడుగురు మావోయిస్టుల మృతి

Encounter in AP | ఏపీలో మరో ఎన్​కౌంటర్​.. ఏడుగురు మావోయిస్టుల మృతి

ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter in AP | ఆంధ్రప్రదేశ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ లడ్డా (AP Intelligence Chief Ladda) తెలిపారు.

మారేడుమిల్లి (Maredumilli) అటవీ ప్రాంతంలో మంగళవారం భారీ ఎన్​కౌంటర్​ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నక్సల్స్​ కీలక నేత మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజేతో పాటు మరో నలుగురు మృతి చెందారు. అయితే అటవీ ప్రాంతంలో మరికొంత మంది మవోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు నిన్నటి నుంచి కూంబింగ్​ చేపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం మరో ఎన్​కౌంటర్​ జరిగింది. మృతుల్లో మావోయిస్టు నేత దేవ్‌జీ (Maoist Leader Devji) ఉన్నట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Encounter in AP | ఆపరేషన్​ కగార్​తో..

ఏపీ పోలీసులు (AP Police) మంగళవారం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున మావోయిస్టులను అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఇంటెలిజెన్స్​ చీఫ్​ వివరాలు వెల్లడించారు. ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి భారీ భద్రత నడుమ మావోయిస్టుల పోలీస్​ కంట్రోల్​ రూమ్​కు తరలించారు. 50 మంది మావోయిస్టులను అరెస్ట్​ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు మనుగడ సాగించలేకపోతున్నారని చెప్పారు. దీంతో వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదట తెలంగాణకు వచ్చారన్నారు. అయితే అక్కడ కొంత మంది కీలక నేతలు లొంగిపోవడంతో తమకు హానీ జరుగుతుందని భావించి ఏపీకి వచ్చారని తెలిపారు. కొంత సమయం ఇక్కడ షెల్టర్ తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

Encounter in AP | రెండు నెలల నుంచి నిఘా

మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్‌కి పూర్తి సమాచారం ఉండటంతో మంగళవారం ఆపరేషన్​ చేపట్టి 50 మందిని అరెస్ట్​ చేశామన్నారు. మావోయిస్టు షెల్టర్‌ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు సూచించారు. లొంగిపోయిన మావోలపై ఉన్న రివార్డులు వారికే ఇచ్చి పునరావాసం కల్పిస్తామన్నారు. మావోయిస్టుల నుంచి రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్స్ , మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్స్, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.