అక్షరటుడే, వెబ్‌డెస్క్: cryptocurrency scam : సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా భారీ క్రిప్టో కరెన్సీ స్కామ్ వెలుగుచూసింది. CoinDCX లో భారీ క్రిప్టోకరెన్సీ స్కామ్‌ను గుర్తించారు. కంపెనీ వాలెట్ల నుంచి సుమారు 44 మిలియన్ డాలర్ల (రూ. 384 కోట్లు) మోసం జరిగినట్లు తేలింది.
CoinDCX జులై 19న తన సిస్టమ్స్‌లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగా.. ఈ భారీ మోసం వెలుగుచూసింది. CoinDCX పబ్లిక్ పాలసీ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ ఉపాధ్యక్షుడు హర్దీప్ సింగ్ జులై 22న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
దీనికి ప్రకారం.. హ్యాకర్లు మొదట తెల్లవారక ముందు అంటే.. 2:37 గంటలకు కేవలం 1 USDT విలువ చేసే చిన్న టెస్ట్ బదిలీని జరిపారు. ఆ తర్వాత 44 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు నిర్వహించారు. సదరు లావాదేవీలు వెలుగు చూడకుండా ఉండేందుకు పలు వాలెట్లలోకి దొంగిలించిన క్రిప్టోకరెన్సీని బదిలీ చేశారు.
cryptocurrency scam : ఇంటి దొంగ ప్రమేయం..
ఈ కేసును బెంగళూరు పోలీసులు Bengaluru police దర్యాప్తు చేపట్టారు. ఈ మోసంలో కంపెనీ అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు CoinDCX ఉద్యోగి రాహుల్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కంపెనీ జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను అనుమతి లేకుండా అగర్వాల్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడని తేలింది. అలా ఏడాది కాలంలో సుమారు రూ.15 లక్షలు ఆర్జించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దోపిడీ కోసం బయట హ్యాకర్లతో కలిసి పనిచేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి నిధుల ప్రవాహాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దొంగిలించబడిన క్రిప్టోకరెన్సీని రికవరీ చేసేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.