Homeక్రైంCBI Raids | ఏకంగా రూ.5 కోట్ల లంచం.. సీబీఐకి చిక్కిన ఈడీ అధికారి

CBI Raids | ఏకంగా రూ.5 కోట్ల లంచం.. సీబీఐకి చిక్కిన ఈడీ అధికారి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Raids | దేశంలో ఎక్కడా చూసిని అవినీతి అధికారుల(Corrupt officials)కు కొదవ లేకుండా పోయింది. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారనే ధీమాతో లంచాలకు మరిగినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఏసీబీ(ACB), సీబీఐ(CBI) దాడులు జరుగుతున్నా.. భయమనేది లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. అధికారుల స్థాయిని బట్టి రూ.వేల నుంచి మొదలుకొని రూ.కోట్ల వరకు లంచాలు అడుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా రూ.ఐదు కోట్లు లంచం డిమాండ్​ చేసి.. రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఓ అధికారిని సీబీఐ అరెస్ట్​ చేసింది.

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ED) అధికారులు అక్రమాస్తులు, మనీలాండరింగ్​ దర్యాప్తు చేస్తారు. నిక్కచ్చిగా ఉండాల్సిన ఓ ఈడీ అధికారే ఏకంగా రూ.ఐదు కోట్ల లంచం డిమాండ్​ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఒడిశాలోని భువనేశ్వర్(Bhuvaneswar)​కు చెందిన వ్యాపారవేత్త రతికాంత రౌత్​ రాయి తవ్వకాల చేపడుతాడు. ఆయనపై ఈడీ కేసు నమోదైంది. ఆ కేసు నుంచి తప్పించినందుకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్(ED Deputy Director)​ రఘువంశీ రూ.ఐదు కోట్ల లంచం డిమాండ్​ చేశాడు.

CBI Raids | కేసు నుంచి తప్పించడానికి..

వ్యాపారి నుంచి మొదటి విడతలో సదరు అధికారి లంచం తీసుకుంటున్నట్లు సీబీఐకి బాధితుడు సమాచారం అందించాడు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్​ రఘువంశీ మార్చిలో తనను విచారణ నిమిత్తం భువనేశ్వర్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిచినట్లు వ్యాపారి సీబీఐ(CBI)కి తెలిపాడు. ఈ కేసు నుంచి తప్పించడానికి భాగతి అనే వ్యక్తిని కలవమని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఆసుపత్రిని అటాచ్ చేయకపోవడం, అరెస్టు చేయకుండా ఉండటానికి రఘువంశీ రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని ఆయన పేర్కొన్నాడు.

అంతమొత్తం ఇవ్వలేనని చెప్పడంతో రూ.రెండు కోట్లకు తగ్గించాడన్నారు. ఈ క్రమంలో తొలి విడతలో రూ.20 లక్షలు ఇవ్వడానికి శుక్రవారం రమ్మన్నాడు. బాధితుడు సీబీఐకి ముందుగానే సమాచారం ఇవ్వడంతో రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా రఘువంశీని అధికారులు అరెస్ట్​ చేశారు. కాగా రఘువంశీ 2013 బ్యాచ్ IRS అధికారి.