Homeబిజినెస్​Tata Motors | టాటా గ్రూప్‌నుంచి మరో కంపెనీ.. రేపు లిస్టవనున్న టీఎంఎల్‌

Tata Motors | టాటా గ్రూప్‌నుంచి మరో కంపెనీ.. రేపు లిస్టవనున్న టీఎంఎల్‌

టాటా మోటార్స్‌ విభజన తుది దశకు చేరుకుంది. టాటామోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ స్టాక్‌ ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడ్‌ అవుతుండగా.. బుధవారంనుంచి టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ స్టాక్‌ కూడా ట్రేడ్‌ కానుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata Motors | టాటా మోటార్స్‌ కంపెనీ తన వ్యాపారాన్ని రెండుగా విభజించింది. కార్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric Vehicles) వ్యాపారాన్ని ఒక కంపెనీగా.. ట్రక్కులు, బస్సుల వ్యాపారాన్ని మరొక కంపెనీగా విభజించిన విషయం తెలిసిందే.

ప్రతి వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించి, మరింత వేగంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ మార్పు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ప్యాసింజర్‌ వెహికల్స్‌ (కార్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు) వ్యాపారాన్ని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ (Tata Motors Passenger Vehicles Ltd.) పేరుతో వ్యవహరిస్తుండగా.. కమర్షియల్‌ వెహికల్స్‌ (ట్రక్కులు, బస్సులు) విభాగం పేరును టాటా మోటార్స్‌ లిమిటెడ్‌గా (Tata Motors Ltd.) నిర్ణయించారు.

ఈ విభజన ప్రక్రియ గతనెల 1 ప్రారంభమైంది. అక్టోబర్‌ 14 నాటికి టాటా మోటార్‌ షేర్లు ఉన్న ప్రతి షేర్‌హోల్డర్‌కు.. పాత టాటా మోటార్స్‌ ఒక షేర్‌కు బదులుగా కొత్త టాటా మోటార్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ స్టాక్‌తో పాటు టాటా మోటార్స్‌ (కమర్షియల్‌) ఒక షేర్‌ ఉచితంగా ఇచ్చారు. ఇప్పటికే షేర్‌ హోల్డర్ల ఖాతాలో ఒక టాటా మోటార్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ స్టాక్‌ యాడ్‌ అయ్యింది. బుధవారం టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ షేరు జమ కానుంది. ఈ రెండు కంపెనీలు పూర్తిగా స్వతంత్రంగా పని చేయనున్నాయి. విభజన ప్రక్రియ పూర్తయ్యాక టాటా గ్రూప్‌ మరింత బలంగా ముందుకు సాగుతుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Tata Motors | ఏ గ్రూప్‌లో ఏ వెహికల్‌ ఉంటాయంటే..

టాటా మోటార్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ లిమిటెడ్‌లో టాటా కార్లు నెక్సాన్‌, పంచ్‌ (Punch), హ్యారియర్‌, ఎలక్ట్రిక్‌ కార్లుంటాయి. టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ ట్రక్కులు (Trucks), బస్సులు, ఫ్లీట్‌ సొల్యూషన్స్‌ చూసుకుంటుంది. దేశంలో టాటా ట్రక్కులకు 37 శాతం మార్కెట్‌ షేర్‌ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ అశోక్‌ లేలాండ్‌తో పోటీ పడుతుందని భావిస్తున్నారు. టీఎంపీవీ (TMPV) షేర్‌ ధర ప్రస్తుతం రూ. 404 ఉంది. టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ (TML) షేర్‌ విలువ సుమారు రూ. 260 ఉండొచ్చని భావిస్తున్నారు. ఏ ప్రైస్‌లో లిస్టవుతుందన్న అంశంపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.

Must Read
Related News