Homeబిజినెస్​IPO | ఐపీవోకు మరో కంపెనీ.. జీఎంపీ ఎంతంటే!

IPO | ఐపీవోకు మరో కంపెనీ.. జీఎంపీ ఎంతంటే!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPO | పబ్లిక్‌ ఇష్యూకు మరో కంపెనీ వస్తోంది. లక్ష్మి ఇండియా ఫైనాన్స్‌ (Laxmi India Finance) సబ్‌స్క్రిప్షన్‌ మంగళవారం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ఐపీవోకు గ్రేమార్కెట్‌ ప్రీమియం 8 శాతంగా ఉంది.

ఐపీవో వివరాలు..

లక్ష్మి ఇండియా ఫైనాన్స్‌ కంపెనీని 1996లో స్థాపించారు. ఇది నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ. ఎంఎస్‌ఎంఈ రుణాలు (MSME loans), వాహన రుణాలు, నిర్మాణాలకు రుణాలు, చిన్నవ్యాపారులకు ఎక్కువగా సెక్యూర్డ్‌ రుణాలు ఇస్తుంది. ఈ కంపెనీ మార్కెట్‌ నుంచి రూ. 254.26 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఇందులో రూ.5 ఫేస్‌ వ్యాల్యూ (Face value) కలిగిన 1.04 కోట్ల తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 165.17 కోట్లు, 56 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించడం ద్వారా రూ. 89.09 కోట్లు సమీకరించనున్నారు. ఐపీవో (IPO) ద్వారా వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్‌ మూలధన అవసరాలు తీర్చడం కోసం, తదుపరి రుణాల మంజూరుకోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది.

ధరల శ్రేణి..

కంపెనీ రూ. 5 ఫేస్‌ వాల్యూ కలిగిన ఒక్కో షేరుకు ప్రైస్‌బాండ్‌ను (Price band) రూ. 150 నుంచి రూ. 158గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 94 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక లాట్‌ కోసం రూ. 14,852 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) 29న ప్రారంభమై 31న ముగుస్తుంది. అలాట్‌మెంట్‌ స్టేటస్‌ ఆగస్టు ఒకటో తేదీ రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 5న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

కోటా, జీఎంపీ..

క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. జీఎంపీ ప్రస్తుతం 13 రూపాయలు ఉంది. అంటే లిస్టింగ్‌ రోజు 8.23 లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.