ePaper
More
    HomeజాతీయంWife killed Husband: రాజా ర‌ఘువంశీ త‌ర‌హాలో మ‌రో మర్డర్ కేసు.. భ‌ర్త‌కు విషమిచ్చి చంపిన...

    Wife killed Husband: రాజా ర‌ఘువంశీ త‌ర‌హాలో మ‌రో మర్డర్ కేసు.. భ‌ర్త‌కు విషమిచ్చి చంపిన భార్య‌!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chhattisgarh Murder | ఈ రోజుల్లో మ‌గాళ్లు పెళ్లి చేసుకోవాలంటే జంకుతున్నారు. అమ్మాయిలు ఎవ‌రో ఒక‌రిని ప్రేమించ‌డం, పెద్ద‌ల కోసం వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకొని ఆ త‌ర్వాత భ‌ర్త‌ని ఎలాగైనా వదిలించుకొని ప్రేమించిన వాడితో జీవించాల‌ని ప్లాన్స్ వేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఇటీవల మేఘాలయలో (Meghalaya) ఒక నవవధువు తన భర్తను పథకం ప్రకారం హత్య చేయించిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసులో మరణించిన భర్త పేరు రాజా రఘువంశీ(Raja Raghu Vanshi). దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలాయ హనీమూన్ (రాజా రఘువంశీ) హత్య కేసు మరవకముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహం జరిగిన 36 రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘోర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    Chhattisgarh Murder | ఏంటి ఈ దారుణం..

    ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం విష్ణుపూర్ గ్రామానికి(Vishnupur village) చెందిన రఘునాథ్ సింగ్ కుమార్తె సునీతకు గత నెల 11న జార్ఖండ్(Jharkhand) రాష్ట్రం గర్హ్వ జిల్లాలోని బహోకుందర్ గ్రామానికి చెందిన బుధ్‌నాథ్ సింగ్‌తో వివాహం జరిగింది. అయితే, వివాహం జరిగిన మరుసటి రోజే తనకు భర్త అంటే ఏ మాత్రం ఇష్టం లేదని తెగేసి చెప్పి సునీత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ నిర్వహించి సునీతకు నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. అయితే భర్త అంటే ఇష్టం లేని సునీత అతన్ని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేసింది. గత శనివారం భర్తతో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. కూరగాయల చెట్లకు మందు కొట్టాలనే సాకుతో భర్తతో పురుగుల మందు కొనిపించింది. ఆదివారం రాత్రి భర్త తినే భోజనంలో ఆ పురుగుల మందు కలిపి పెట్టినట్లు తెలుస్తోంది.

    రాత్రి భోజనం చేసి నిద్రపోయిన బుధ్‌నాథ్(Budhnath Singh) నిద్రలోనే మృతి చెందాడు. మరుసటి రోజు ఉదయం బుధ్‌నాథ్ మృతి చెందాడని తెలుసుకున్న అతని తల్లి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోడలే కొడుకు తినే భోజనంలో విషం కలిపిందని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మ‌రో కేసులో బదౌన్‌కు చెందిన సునీల్‌ అనే యువకుడికి మే 17న ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లిన నవవధువు అక్కడ తొమ్మిది రోజులు ఉంది. అనంతరం సంప్రదాయం ప్రకారం పుట్టింటికి తిరిగి వచ్చింది. అయితే, కొన్ని రోజులకే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు ఆ నవవధువు అనూహ్యంగా పోలీసుల ఎదుట ప్రత్యక్షమైంది. తాను తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయానని అంగీకరించింది. ఈ విషయం తెలుసుకున్న సునీల్ ఇప్పుడు తను ప్రియుడితో వెళ్లిపోయింది. ఏదేమైనా, నేను మరో రాజా రఘువంశీ కానందుకు సంతోషిస్తున్నాను అని అన్నాడు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...