అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GK Energy IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో (Domestic Stock Market) లిస్టింగ్ కోసం జీకే ఎనర్జీ (GK Energy) కంపెనీ ఐపీవోకు వస్తోంది. ఈ ఐపీవోపై ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది. జీఎంపీ బాగుండడంతో భారీగా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యే అవకాశాలున్నాయి.
జీకే ఎనర్జీ లిమిటెడ్ (GK Energy Limited) భారతదేశంలోని అతిపెద్ద సోలార్ పంప్ ఈపీసీ (EPC), రూఫ్‌టాప్ మాడ్యూల్స్ ప్యూర్ ప్లే ప్రొవైడర్. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ పథకం (పీఎం కుసుమ్ పథకం) యొక్క కాంపోనెంట్ బీ కింద సౌరశక్తితో పనిచేసే వ్యవసాయ నీటి పంపు వ్యవస్థల కోసం ఇంజినీరింగ్, సేకరణ మరియు కమీషనింగ్ (ఈపీసీ) సేవలను అందించే భారతదేశంలో అతిపెద్ద ప్యూర్ ప్లే ప్రొవైడం. ఇది రైతులకు సౌరశక్తితో (Solar Power) పనిచేసే పంపు వ్యవస్థల సర్వే, డిజైన్, సరఫరా, అసెంబ్లీ మరియు ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమీషనింగ్ మరియు నిర్వహణ కోసం ఎండ్ టు ఎండ్ సింగిల్ సోర్స్ సొల్యూషన్‌ను అందిస్తుంది. ఇది మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పీఎం కుసుమ్ పథకం (PM kusum yojana) కోసం కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కింద విక్రేతగా ఎంపానెల్ చేయబడిరది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి కంపెనీ వద్ద రూ. 1,028 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.
GK Energy IPO | రూ. 464.26 కోట్లను సమీకరించడం కోసం..
ఈ కంపెనీ రూ. 464.26 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు (IPO) వస్తోంది. ఇందులో 2.61 కోట్ల తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 400 కోట్లు, 0.42 కోట్ల కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విక్రయించి రూ. 64.26 కోట్ల వరకు సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు నిధులు సమకూర్చడం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
GK Energy IPO | ధరల శ్రేణి..
కంపెనీ ధరల శ్రేణి(Price band)ని ఒక్కో షేరుకు రూ. 145 నుంచి రూ. 153గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 98 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ.14,994తో దరఖాస్తు చేసుకోవాలి.
GK Energy IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కోటా ఇచ్చారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 34 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 22 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
GK Energy IPO | ముఖ్యమైన తేదీలు..
జీకే ఎనర్జీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) శుక్రవారం ప్రారంభమవుతుంది. 23న ముగుస్తుంది. 24న రాత్రి అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 26న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ అవుతాయి.