HomeUncategorizedAir India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

Air India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Air India | మరో ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్‌(Ahmedabad) నుంచి లండన్‌(London) వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య రావడంతో పైలెట్​(Pilot) విమానాన్ని నిలిపివేశారు. ఇటీవల అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్లాల్సిన విమానం నంబర్​ ఏఐ 171 కూలిపోవడంతో ఆ నంబర్​ను ఎయిర్​ ఇండియా(Air India) తొలగించింది. మృతుల గౌరవర్థం ఆ నంబర్​ వినియోగించకూడదని నిర్ణయించింది. దాని స్థానంలో ఏఐ 159 విమానం లండన్​–అహ్మదాబాద్​ మధ్య రాకపోకలు సాగిస్తోంది. అయితే ఈ విమానంలో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. 200 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 1.10కి విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యను గుర్తించి పైలట్ ఫ్లైట్​ను నిలిపివేశారు.