Homeక్రైంDelhi | మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు

Delhi | మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi | అహ్మదాబాద్​లో విమాన ప్రమాదం (Ahmedabad Plane crash) దేశంలో తీరని విషాదం నింపింది. విమాన ప్రమాదం విషాదం మరువక ముందే ఢిల్లీ(Delhi)లో ఓ రైలు పట్టాలు తప్పింది. హజ్రత్ నిజాముద్దీన్ –ఘజియాబాద్ మధ్య నడుస్తున్న రైలు గురువారం మధ్యాహ్నం శివాజీ బ్రిడ్జి స్టేషన్ (Shivaji Bridge Station) సమీపంలో పట్టాలు తప్పింది. ప్యాసింజర్ రైలు నాలుగో కోచ్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.

Delhi | రైళ్ల దారి మళ్లింపు

రైలు పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గం నడిచే రైళ్లను దారి మళ్లించారు. రద్దీగా ఉండే మార్గంలో ఉన్న అనేక రైళ్లు ఆలస్యం అయ్యాయి. అధికారులు వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్రేన్​ సాయంతో ఆ కోచ్​ను తొలగించారు. కాగా రైలు పట్టాలు తప్పడంపై విచారణ ప్రారంభించామని అధికారులు తెలిపారు. సాయంత్రంలోగా ట్రాక్​ను సరి చేసిన అధికారులు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

Must Read
Related News