ePaper
More
    HomeతెలంగాణDasharathi Award | అన్నవరం దేవేందర్​కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు

    Dasharathi Award | అన్నవరం దేవేందర్​కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dasharathi Award | రాష్ట్ర ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు (Dasarathi Krishnamacharya Award) కవి అన్నవరం దేవేందర్ (Annavarm Devendar)​ను దేవేందర్​ను ఎంపిక చేసింది. దాశరథి జయంతి సందర్భంగా ఏటా జులై 22న ప్రభుత్వం పురస్కారం అందజేస్తోంది. సాహిత్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డు అందిస్తారు. రూ.1,01,116 నగదుతో పాటు దాశరథి స్మారక అవార్డు ఇస్తారు. 2015 నుంచి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేస్తోంది. 2025 సంవత్సరానికి గాను అన్నవరం దేవేందర్​కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Dasharathi Award | అన్నవరం దేవేందర్​ నేపథ్యం..

    అన్నవరం దేవేందర్​ సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్​ మండలం పోతారం గ్రామంలో 1962లో జన్మించారు. 25 ఏళ్లుగా కవి, రచయిత, కాలమిస్ట్​గా రచనలు చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు 12 కవితా సంపుటాలు, 2 వ్యాస సంకలనాలు వెలువరించారు. దేవేందర్ 1986 ప్రాంతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం కూడా కవిత్వం, రచనలతో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు. పంచాయతీ రాజ్​శాఖలో ఉద్యోగం కూడా చేశారు. 2020 అక్టోబర్​లో ఉద్యోగ విరమణ చేశారు. మన సంపతి, ఆపతి–సంపతి, కట్ట మైసమ్మ, పాత కథ పేరిట ఆయన కవితా సంకలను వెలువరించారు. ఇంకా ఆయన ఎన్నో రచనలు చేశారు. ఇప్పటికే చాలా అవార్డులు ఆయనను వరించగా.. తాజాగా ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపిక చేసింది.

    Dasharathi Award | గతంలో అవార్డు అందుకున్న వారు..

    రాష్ట్రంలో 2015లో కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్య, 2016 జె బాపురెడ్డి, 2017లో ఎన్​ గోపి, 2018 వఝల శివకుమార్, 2019 కూరెళ్ల విఠలాచార్య, 2020 తిరునగరి రామానుజయ్య, 2021 ఎల్లూరి శివారెడ్డి, 2022 వేణు సంకోజు, 2023లో కామారెడ్డికి చెందిన కవి అయాచితం నటేశ్వరశర్మ, 2024లో జూకంటి జగన్నాథం దాశరథి పురస్కారాన్ని అందుకున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...