HomeUncategorizedKuwait | కువైట్‌లో చిక్కుకున్న ఏపీ మ‌హిళ‌.. ఇక్క‌డ టార్చ‌ర్ పెడుతున్నారంటూ వీడియో విడుద‌ల‌

Kuwait | కువైట్‌లో చిక్కుకున్న ఏపీ మ‌హిళ‌.. ఇక్క‌డ టార్చ‌ర్ పెడుతున్నారంటూ వీడియో విడుద‌ల‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kuwait | బ‌తువుతెరువు కోసం చాలా మంది సముద్రాలు దాటి వెళ్లి మ‌రీ పనులు చేస్తున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల‌లో వారు చాలా న‌ర‌యాత‌క‌న అనుభ‌వించాల్సి వ‌స్తుంది. తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన పుష్ప అనే మహిళ, ఏజెంట్ మాటలు నమ్మి కువైట్(Kuwait) వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురవుతున్నానని, తనను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని కన్నీటిపర్యంతమవుతూ వీడియో విడ‌ద‌ల చేసింది. మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh),చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) చొరవ తీసుకుని తనను ఆదుకోవాలని ఆమె ఓ వీడియో ద్వారా అభ్యర్థించారు.వివ‌రాల‌లోకి వెళిత అన్నమయ్య జిల్లా గేరంపల్లికి చెందిన పుష్ప అనే తెలుగు మహిళ కువైట్‌లో భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

Kuwait | న‌న్ను కాపాడండి..

ఏజెంట్ చెప్పిన వాగ్దానాలు న‌మ్మి అక్క‌డికి వెళ్లిన ఆమె జీవితమే తలకిందులైంది.పుష్ప భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల బాధ్యత తనపై పడింది. వారి చదువులకు అవసరమైన డబ్బు కోసం కువైట్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పీలేరు(Peeleru)కు చెందిన సురేష్ అలియాస్ స్వరాజ్ అనే ఏజెంట్ ద్వారా మే 27న కువైట్‌ చేరారు.పని పేరుతో ఆమెని బానిస‌లా ప‌ని చేయిస్తున్నార‌ట‌. యజమానులు తిండీ (FOOD) సరిగా పెట్టడం లేదని, శారీరకంగా వేధిస్తున్నారని పుష్ప వాపోయారు. కొడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. తినడానికి కూడా ఇవ్వడం లేదు, అంటూ ఆమె కన్నీటి కథను వీడియోలో వెల్లడించారు.

ఆమె బాధ‌ని ఎవ‌రికి చెప్పుకోలేక బాత్రూంలో దాక్కొని వీడియో రికార్డ్(Video record) చేశారు. బయట తలుపులు కొడుతున్నారు. నేను బతకలేకపోతున్నాను. పిల్లల కోసం బతకాల్సిందే, అంటూ ఆవేదనతో వివరించారు. తమ ఇల్లు విడిచిపెట్టాలంటే రెండు వేల కువైటీ దినార్లు చెల్లించాలంటున్నారని ఆమె తెలిపారు. తన వద్ద ఆ డబ్బు లేదని, నెల జీతం కేవలం 110 దినార్లే అని చెప్పింది. ఇప్పటి వరకు ఒక్క నెల జీతం మాత్రమే అడిగి తీసుకున్నానని వాపోయారు.ఏజెంట్ సురేష్‌(Agent Suresh)ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయ‌న తిడుతున్న‌ట్టు ఆరోపించింది. తనను ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడేసి, ఇండియాకు సురక్షితంగా తీసుకురావాలని మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ను, ఏపీ ప్రభుత్వాన్ని పుష్ప వేడుకున్నారు.

Must Read
Related News