అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Raj Bhavan | స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ రాజ్ భవన్ వేదికగా ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా “ఎట్ హోం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి హాజరు కావడం విశేషం.
అయితే ఇది అధికారికంగా పవన్ కళ్యాణ్ తన సతీమణితో పాల్గొన్న తొలి ప్రముఖ కార్యక్రమాలలో ఒకటిగా మారింది. ఈ జంట రాజ్ భవన్(Raj Bhavan) వేదికపై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మరోవైపు పవన్ సతీమణి అన్నా లెజినోవాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) సరదాగా ముచ్చట్లు ఆడుతున్న దృశ్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.
Raj Bhavan | అందరి దృష్టిని ఆకర్షించిన అన్నా..
భువనేశ్వరి, అన్నా ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ పలుచోట్ల చర్చలు జరుపుతూ కనిపించారు. మరోవైపు ప్రధాన వేదికపై గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhushan Harichandan) పక్కన చంద్రబాబు, ఆయన పక్కన పవన్ కూర్చోగా, వీరి ఎదురుగా భువనేశ్వరి – అన్నా లెజినోవా కూర్చుండటం వేదికకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ పక్కన నారా లోకేష్ కూర్చోవడం కూడా బంధాన్ని ప్రతిబింబించిందని చెబుతున్నారు. అంతకు ముందు పిఠాపురంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సతీమణిని వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అధికార కార్యక్రమాల్లో అన్నా లెజినోవా(Anna Lezhinova) కూడా పాల్గొనడం పట్ల జనసేన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అన్ని అధికారిక కార్యక్రమాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనడం, ఉచిత బస్సు ప్రారంభానికి ఇద్దరూ ఒకే బస్సులో ప్రయాణించడం… ఈ కూటమి బంధాన్ని మరింత బలంగా చూపిస్తోంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “ఈ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు కొనసాగాలన్నదే నా ఆకాంక్ష” అని స్పష్టం చేశారు. దీని ద్వారా టీడీపీ – జనసేన బీజేపీ కూటమి పటిష్టంగా ఉందన్న సంకేతం ప్రజలకు పంపే ప్రయత్నమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి ఎట్ హోం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా అన్నా లెజినోవా ఫోకస్ అయ్యారు.