ePaper
More
    HomeసినిమాAnirudh Ravichander | కావ్య మార‌న్‌తో వివాహంపై అనిరుథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    Anirudh Ravichander | కావ్య మార‌న్‌తో వివాహంపై అనిరుథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anirudh Ravichander | సోషల్ మీడియాలో జ‌రిగే కొన్ని ప్ర‌చారాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. అందులో ఎంత నిజం ఉందో తెలియ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియాలో (Social Media) మాత్రం తెగ స్ప్రెడ్ చేస్తుంటారు.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ (Kavya Maran), సౌతిండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ (Anirudh Ravichander) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతేడాది లాస్ వేగస్‌లో ఈ ఇద్దరూ కలిసి తిరుగుతూ కనిపించారని పలువురు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు కూడా తెలిసిందని, త్వరలోనే వివాహ బంధంతో ఈ జోడీ ఒక్కటి కానున్నారంటూ కూడా ప్రచారం న‌డుస్తుంది.

    Anirudh Ravichander | క్లారిటీ ఇచ్చారుగా..

    అయితే ఈ వార్తలపై అనిరుధ్ వ్యక్తిగత బృందం తాజాగా క్లారిటీనిచ్చింది. సోష‌ల్ మీడియాలో (Social Media) వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అనిరుధ్ బృందం (Anirudh team) స్పష్టం చేసింది. కావ్య మార‌న్ తాను మంచి స్నేహితులు మాత్రమేనని అనిరుధ్ వ్యక్తిగత బృందం తెలిపింది. కాగా.. అనిరుద్ పై ఇలాంటి వార్త‌లు రావ‌డం కొత్తేమికాదు. ఇంత‌కుముందు కూడా నటి కీర్తి సురేష్ (Keerthy Suresh), గాయని జోనితా గాంధీ (singer Jonita Gandhi), నటి త్రిషలతో (actress Trisha) డేటింగ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌లు కూడా రుమార్స్ అని త‌ర్వాత తెలిసింది.

    ఈ వార్తలపై కావ్యమారన్ టీమ్ కూడా అధికారికంగా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అనిరుధ్ (Anirudh), కావ్య మారన్ (Kavya Maran) మంచి స్నేహితులు మాత్రమేనని, పెళ్లి వార్తల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొంది. తమ పరువుకు భంగం కలిగేలా వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేసింది. కొన్ని మీడియా సంస్థలకు కావ్య మారన్ టీమ్ నోటీసులు కూడా పంపించింది. పెళ్లి గురించి అసత్య వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...