Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | పశు సంవర్ధక శాఖ సేవలు మెరుగుపర్చాలి: కలెక్టర్​

Nizamabad Collector | పశు సంవర్ధక శాఖ సేవలు మెరుగుపర్చాలి: కలెక్టర్​

పశు సంవర్ధక శాఖ సేవలను రైతులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్​లో బుధవారం పశు సంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ పశు సంవర్ధక శాఖ సేవలను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో బుధవారం పశు సంవర్ధక శాఖపై (Animal Husbandry Department) సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాడి రైతులకు అవసరమైన సేవలు అందించేలా పశు వైద్యాధికారులు (veterinary officers) అందుబాటులో ఉండాలన్నారు. వెటర్నరీ డాక్టర్లు లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయాలని, మూగజీవాలకు సకాలంలో వైద్య అందేలా చూడాలన్నారు. ఆయా సీజన్లలో పశువులకు సోకే వ్యాధులను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి అవసరమైన సూచనలు చేయాలని తెలిపారు.

మూగ జీవాలకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్, వైద్యసేవలు (vaccination and medical services) అందేలా పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలన్నారు. గ్రామాల్లో పశు వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు, సంచార పశు వైద్యవాహనం 1962 ద్వారా చికిత్సలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit), పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ రోహిత్ రెడ్డి, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.