అక్షరటుడే, వెబ్‌డెస్క్: Street Dogs | వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఒకేరోజు 25 మంది దాడి చేశాయి. ఈ ఘటన మెదక్ జిల్లా(Medak district) తూప్రాన్ పట్ణణంలో చోటు చేసుకుంది. తూప్రాన్(Toopran)లో ఆదివారం సాయంత్రం బోనాలు ఘనంగా నిర్వహించారు. బోనాలు పండుగలో పాల్గొన్న ప్రజలపై కుక్కులు దాడి చేశాయి. అలాగే ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను సైతం కరిచాయి.
కుక్కల దాడిలో పదేళ్లలోపు పిల్లలు ఐదుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అనిరుధ్(3) అనే చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్(Hyderabad) తరలించారు. రితీశ్ అనే బాలుడికి కూడా గాయాలు తీవ్రంగా కావడంతో మెదక్ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారికి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.
Street Dogs | బాలుడి మృతి మరువక ముందే..
మెదక్ జిల్లాలో ఇటీవల కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. శివ్వంపేట మండలం రూప్లతండా (Rupla Thanda)లో నితున్(3) అనే బాలుడిపై శుక్రవారం దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మరోసారి మెదక్ జిల్లాలో కుక్కలు రెచ్చిపోయాయి.
Street Dogs | కుక్కల బెడదతో ప్రజల ఇబ్బందులు
రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కల(Street Dogs) బెడద అధికం అయింది. ఎక్కడ చూసిన కుక్కలే కనిపిస్తున్నాయి. ఒంటరిగా వెళ్తున్న వారు, చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడిలో ఎంతో మంది చనిపోతున్నారు. చాలా మంది గాయపడుతున్నారు. అయినా ప్రభుత్వం, అధికారుల కుక్కల బెడద నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.