అక్షరటుడే, ముంబై: Angel One | భారతదేశపు దిగ్గజ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం ఏంజెల్ వన్ (Angel One), డిజిటల్ ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి, నియంత్రణ సంస్థ అనుమతులకు లోబడి, లివ్‌వెల్‌తో (LivWell) జాయింట్ వెంచర్ నెలకొల్పనుంది.
రూ. 400 కోట్ల పెట్టుబడులు ఉండే ప్రతిపాదిత కంపెనీని ఏంజెల్ వన్ లిమిటెడ్ (26 శాతం వాటా), లివ్‌వెల్ హోల్డింగ్ కంపెనీ పీటీఈ లిమిటెడ్ (LivWell Holding Company Pte Ltd) (74 శాతం వాటా) కలిసి ప్రమోట్ చేస్తాయి. టెక్నాలజీ, విశ్వసనీయత ద్వారా భారత్‌లో జీవిత బీమా లభ్యతను పునర్నిర్వచించాలనే ఉమ్మడి లక్ష్యంతో పని చేస్తాయి.
ఆర్థికాంశాలపై అవగాహన, డిజిటల్ వినియోగం పెరుగుతున్నప్పటికీ, భారత్‌లో బీమా తీసుకునే వారి సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంటోంది. భద్రతకు సంబంధించిన అంతరం 83 శాతానికిపైగా ఉంది. భారతీయులకు తగినంత జీవిత బీమా ఉండడం లేదు. ముఖ్యంగా ఆదాయాన్ని ఆర్జించే 26-351 ఏళ్ల వయస్సు శ్రేణి వారిలో ఇది మరింత తీవ్రంగా ఉంటోంది. మరిన్ని కొత్త ఆవిష్కరణలు, బీమా ఉత్పత్తులు మరియు పంపిణీలో మరింత పారదర్శకత, లభ్యత మరియు విశ్వసనీయత ఆవశ్యకతను ఇది సూచిస్తోంది.
నిరాటంకమైన డిజిటల్ అనుభూతిని కల్పించేలా, సరళమైన, విశ్వసనీయమైన జీవిత బీమా పథకాలను (life insurance plans) అందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలనేది ఏంజెల్ వన్, లివ్‌వెల్ లక్ష్యం. వాస్తవ జీవిత అవసరాలకు తగ్గట్లుగా బీమాను అఫోర్డబుల్‌గా, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు, టెక్ ఆధారిత ఆటోమేషన్, వ్యక్తిగతీకరణను ఉపయోగించి డిజిటల్-ఫస్ట్ విధానంలో పని చేయడం మీద జేవీ ప్రధానంగా దృష్టి పెడుతుంది.
“జీవిత బీమా అనేది స్పష్టత, ధీమాను కల్పించాలే తప్ప సంక్లిష్టంగా ఉండకూడదు. అయినప్పటికీ, ఇటీవలి అధ్యయనం ప్రకారం, 40 శాతం మంది పైగా పాలసీదారులు తమ కవరేజీని అర్థం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. లివ్‌వెల్ యొక్క రక్షణ ఆధారిత, డిజిటల్ నేటివ్ మోడల్ ఈ పరిస్థితిని మార్చే విధంగా రూపొందించబడింది. భారత్ డిజిటల్ ఆర్థిక సేవలను మరింతగా వినియోగించుకునే కొద్దీ, బీమా భద్రత కూడా విశ్వసనీయమైన ప్లాట్‌ఫాంల ద్వారా పారదర్శకమైన, నిరాటంకమైన విధంగా మరింత అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.
వివిధ ఫైనాన్షియల్ లైఫ్‌సైకిల్స్‌వ్యాప్తంగా మరిన్ని ప్రోడక్టులను అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది. పొదుపు, ఇన్వెస్టింగ్, రక్షణకు సంబంధించి నిరాటంకమైన, మెరుగైన అనుభూతిని అందించేందుకు దోహదపడుతుంది. ప్రొటెక్షన్ సెగ్మెంట్‌కి సంబంధించి మా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ (digital distribution) విధానాలను పటిష్టం చేసేందుకు ఈ జేవీ యొక్క ప్రోడక్టులు ఉపయోగపడతాయి. తద్వారా మా క్లయింట్లతో దీర్ఘకాలిక బంధాన్ని పటిష్టపర్చుకునేందుకు దోహదపడతాయి” అని ఏంజెల్ వన్ లిమిటెడ్ గ్రూప్ సీఈవో Mr. అంబరీష్ కెంఘె (Ambarish Kenghe) తెలిపారు.
లివ్‌వెల్ నాయకత్వ బృందానికి బీమా, ఆర్థిక రంగాల్లో విస్తృత అనుభవం ఉంది. ప్రుడెన్షియల్ ఏషియా మాజీ రీజినల్ సీఈవో విల్ఫ్ బ్లాక్‌బర్న్(Wilf Blackburn), ప్రతిపాదిత వెంచర్‌కి చెయిర్‌గా వ్యవహరించనుండగా, అవీవా వియత్నం మాజీ డిప్యుటీ సీఈవో నిఖిల్ వర్మ సీఈవోగా సారథ్యం వహించనున్నారు. లివ్‌వెల్‌కి ఆసియాపై ఫోకస్‌తో 2.6 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒలింపస్ క్యాపిటల్ దన్ను ఉంది. ఆసియాలో ఆర్థిక సేవల విభాగంలో ఒలింపస్ 20 పైగా సంస్థలకు తోడ్పాటు అందించింది. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్, థాయ్ క్రెడిట్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఉత్కర్ష్ SFB, క్రెడిట్‌యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైనవి ఉన్నాయి.
“బీమా పథకాలు, సరళంగా, నిర్దిష్ట లక్ష్యంతో అందిస్తే పెద్ద ఎత్తున అర్ధవంతమైన ప్రభావం చూపగలవనే విషయం లివ్‌వెల్‌కి చక్కగా తెలుసు. మా తొలి మార్కెట్ అయిన వియత్నాంలో, పెద్ద స్థాయిలో విస్తరించేందుకు ఎంబెడెడ్,డిజిటల్ ఫస్ట్ ఇన్సూరెన్స్ మోడల్స్ అనువైనవిగా ఉంటాయని, నమ్మకం, లభ్యత రెండింటి మేళవింపుతో వినియోగదారులకు మరింత చేరువకావచ్చని నిరూపితమైంది. భారత్‌లో బీమాకు సంబంధించి అంతరాలుండడం వల్ల మాత్రమే కాదు, వినియోగదారుల అంచనాలు ఫండమెంటల్‌గా గణనీయంగా పెరిగాయి కాబట్టి భారత్‌లో విశిష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఏంజెల్ వన్ యొక్క డిజిటల్ విస్తృతి, మార్కెట్లో విశ్వసనీయత తోడ్పాటుతో నేటి కస్టమర్లకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రోడక్టులను అందించే కొత్త తరం డిజిటల్ ఇన్సూరెన్స్ సంస్థను తీర్చిదిద్దవచ్చని మేము భావిస్తున్నాం” అని లివ్‌వెల్ సీఈవో Mr. నిఖిల్ వర్మ తెలిపారు.
2047 నాటికి అందరికీ బీమా ఉండాలన్న ప్రభుత్వ విజన్ దన్నుతో భారత్‌లో జీవిత బీమా రంగం (life insurance sector), అధిక వృద్ధి దశలోకి ప్రవేశిస్తోంది. జీవిత బీమా కవరేజీని సరళతరంగా, మరింత అందుబాటులో ఉండేలా, అర్థం చేసుకునేందుకు సులువుగా ఉండేలా మార్చడం ద్వారా ప్రొటెక్షన్‌కి సంబంధించిన అంతరాలను భర్తీ చేసేందుకు ఈ భాగస్వామ్యం పటిష్ట స్థితిలో ఉంది. ప్రొటెక్షన్-ఫస్ట్ ఇన్సూరర్‌ను నిర్మించడం ద్వారా ఏంజెల్ వన్, లివ్‌వెల్ సంస్థలు ఆర్థిక సంరక్షణపై ఉమ్మడిగా ఫోకస్ పెడుతూ అంతగా సేవలందని, భారీ మార్కెట్‌కు మరింత చేరువ కానున్నాయి.
ఫుల్-స్టాక్ ఆర్థిక సేవల దిగ్గజంగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఏంజెల్ వన్ సాగిస్తున్న ప్రస్థానంలో ఇది మరొక కీలక మైలురాయిగా నిలుస్తుంది.