అక్షరటుడే, ఇందూరు: Anganwadi Teachers | అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు (CITU leaders) రమేష్ బాబు, నూర్జహాన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC president Mahesh Kumar Goud) ఇంటిని సోమవారం అంగన్వాడీ యూనియన్ నాయకులు ముట్టడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నోసార్లు తమ సమస్యలను వివరించామని, అయినా స్పందించడం లేదన్నారు. అంగన్వాడీలను (Anganwadi workers) రెగ్యులరైజేషన్ చేయాలని, ప్రీ ప్రైమరీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 26వేల వేతనం ఇవ్వాలన్నారు. ప్రధానంగా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించడంతో పోలీసులు అంగన్వాడీలను అరెస్టు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు స్వర్ణ, చంద్రకళ, సందీపని, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.