అక్షరటుడే, వెబ్డెస్క్ : Anganwadi Teachers | మినీ అంగన్వాడీ mini anganwadi టీచర్లకు ప్రభుత్వం state govt గుడ్ న్యూస్ చెప్పింది.
అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ promotion కల్పించింది. దీంతో రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రయోజనం కలగనుంది. మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రస్తుతం రూ.7,800 వేతనం salary అందిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు రూ.13,650 జీతం ఇస్తున్నారు. మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్ కల్పించడంతో ఇక నుంచి వారు రూ.13,650 జీతం అందుకోనున్నారు.
రాష్ట్రంలో ఇకపై మినీ అంగన్వాడీలు ఉండవని ప్రభుత్వం తెలిపింది. అంగన్వాడీ టీచర్లు అందరూ ఒకటేనని పేర్కొంది. దీంతో మినీ అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన జీతాలు ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి.