అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Android Phones | ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఏ రకంగా పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనకు అర్ధం అవుతుంది.
స్మార్ట్ ఫోన్(Smart Phone) అనేది ఇప్పుడు రోజు వారీ అవసరంగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లనే ఎక్కువ శాతం మంది ఉపయోగిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. చాలా తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లతో పలు కంపెనీలు మనకు ఫోన్స్ అందిస్తున్నాయి. చాలా మంది మిడ్ రేంజ్ ఫోన్లను వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు పోటీ పడి మరీ అలాంటి ఫోన్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి.
Android Phones | అందరూ అయోమయం..
అయితే స్మార్ట్ ఫోన్స్‌కి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. కంపెనీ కొత్త అప్‌డేట్(Company New Update) ఇచ్చినప్పుడు చాలా మంది ఆ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకొని కొత్త ఫీచర్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్స్(Android Phones)లో కాల్ లాగ్ అప్‌డేట్(Call Log Update) రాగా, అది చూసి చాలా మంది యూజర్స్ అయోమయానికి గురయ్యారు. ఏంటి నా ఫోన్ హ్యాక్ అయిందా ఏంటా అని కొందరు, పిల్లలు ఆడుకుంటూ ఫోన్‌ని ఏమైనా చేశారా అని మరి కొందరు అయోమయానికి గురయ్యారు. అయితే ఈ ఫీచర్ అస్సలు ఏమాత్రం బాగోలేదని, తిట్టిపోస్తున్నారు. ఏదో మంచి అప్‌డేట్ వస్తుందని అనుకుంటే ఇలాంటి అప్‌డేట్ ఇచ్చారేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త అప్‌డేట్‌లో ఒకవైపు డిక్లైన్ బటన్, మరో వైపు ఆన్సర్ బటన్ ఉండగా, మధ్యలో కాల్ సింబల్ ఒకటే ఉంటుంది. సాధారణంగా అయితే మనకు రెడ్, గ్రీన్ బటన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి ఒకటే బటన్ ఇచ్చాడు. దీంతో అందరిలో గందరగోళం ఏర్పడింది. కొందరు అయితే నా ఫోన్ ఏంటి ఐ ఫోన్‌గా మారిందనే భ్రమలో ఉన్నారట. అయితే ఓ యూజర్.. ఈ అప్‌డేట్ క్యాన్సిల్ చేసుకోవడానికి.. కాలర్ యాప్ (Caller app) ప్రెస్ చేసి పట్టుకొని యాప్ ఇన్ఫో నొక్కి కింద మిడిల్‌లో డిలీట్ అప్‌డేట్ అనే ఆప్షన్‌ని సెలక్ట్ చేసుకుంటే మళ్లీ ఓల్డ్ వర్షెన్ వచ్చేస్తుందని అంటున్నాడు. మరి మీలో ఎవరైనా కొత్త అప్‌డేట్‌తో ఇబ్బంది పడితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.