HomeUncategorizedStree Shakti Scheme | ఏపీలో ఉచిత బస్సు ప్ర‌యాణం మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండర్స్‌కే కాదు.. వారంద‌రికి...

Stree Shakti Scheme | ఏపీలో ఉచిత బస్సు ప్ర‌యాణం మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండర్స్‌కే కాదు.. వారంద‌రికి వ‌ర్తిస్తుంది!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stree Shakti Scheme | ఎన్నిక‌ల హామీలో భాగంగా ప్రకటించిన ఉచిత బస్ ప్రయాణ పథకం ఎట్ట‌కేల‌కి ఏపీలో అమలులోకి వచ్చింది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Nara Chandra Babu) నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి మాధవ్ కలిసి “స్త్రీశక్తి” పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌ కింద మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. కేవలం మహిళలకే కాకుండా, ఇతర ప్రత్యేక వర్గాలకూ ఈ పథకం వర్తించనుంది. వారు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి బ‌స్సుల‌లో ప్ర‌యాణించ‌వ‌చ్చు.

వీరు కూడా అర్హులే..

1. ఉచిత ప్రయాణానికి అర్హులు ఎవరు?

  • మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు
  • వారు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు
  • సిటీ, రూరల్ బస్సులలో ప్రయాణానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు

2. దివ్యాంగులు (40% కి పైగా అంగవైకల్యం ఉన్నవారు)

  • ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో ఉచితం
  • ఇతర రాష్ట్రాలకు: 50% రాయితీ
  • అవసరమైనవి: దివ్యాంగ సర్టిఫికెట్, ఫోటో ఐడీ

3. మాజీ సైనికులు, అమరవీరుల భార్యలు

  • రాష్ట్రంలోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితం
  • ఇతర రాష్ట్రాలకు ఛార్జీలు వర్తిస్తాయి
  • అవసరమైనవి: ఎక్స్‌ సర్వీస్‌మెన్ కార్డు

4. వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు)

  •  పల్లె వెలుగు, సిటీ సర్వీస్‌లలో ఉచితం
  •  కొన్ని బస్సుల్లో 50% రాయితీ
  • అవసరమైనవి: వయసును రుజువు చేసే ఐడీ

5. స్వాతంత్ర సమరయోధులు, వారి జీవిత భాగస్వాములు

  •  ఏసీ మినహా అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం
  •  అవసరమైనవి: గుర్తింపు పొందిన సర్టిఫికెట్

6. విద్యార్థులు

  • పట్టణాల్లో 22 కి.మీ., గ్రామాల్లో 20 కి.మీ. వరకు ఉచితం
  • అవసరమైనవి: విద్యా సంస్థ ధ్రువీకరణతో పాస్

7. జర్నలిస్టులు

  • నగర/సబ్‌రర్బన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం
  • ఇతర సర్వీసుల్లో రాయితీ
  • అవసరమైనవి: ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డు

8. ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, వారి భార్యలు)

  • దాదాపు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • అవసరమైనవి: ప్రభుత్వ ఐడీ కార్డు

ఈ పథకం ద్వారా లక్షలాది మంది ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ Schemeను రూపొందించింది. మీరు ఏ వర్గానికి చెందుతారో, మీకు వర్తించేది ఏ స్కీమ్ అనేది తెలుసుకొని, అవసరమైన పత్రాలతో ప్రయాణం ప్రారంభించండి!