Forest Officer Bribery Case | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Officer Bribery Case | మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB)కి చిక్కింది. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఫారెస్ట్ సెక్షన్​ ఆఫీసర్ (Forest Section Officer)​ను అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) ఫారెస్ట్ సెక్షన్​ అధికారిగా సాదు సురేష్​కుమార్​ పని చేస్తున్నాడు. అటవీ శాఖ అధికారులు పాలెకోడేరు మండ​లంలో ఓ సామిల్లును సీజ్​ చేశారు. సదరు సామిల్లును రీ ఓపెన్​ చేయడానికి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Officer Bribery Case | మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB)కి చిక్కింది. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఫారెస్ట్ సెక్షన్​ ఆఫీసర్ (Forest Section Officer)​ను అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) ఫారెస్ట్ సెక్షన్​ అధికారిగా సాదు సురేష్​కుమార్​ పని చేస్తున్నాడు. అటవీ శాఖ అధికారులు పాలెకోడేరు మండ​లంలో ఓ సామిల్లును సీజ్​ చేశారు. సదరు సామిల్లును రీ ఓపెన్​ చేయడానికి ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​ రూ.4 లక్షల లంచం అడిగాడు. దీంతో దాని యజమాని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు మంగళవారం బాధితుడి నుంచి రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సెక్షన్​ అధికారి సురేష్​ను పట్టుకున్నారు.

Forest Officer Bribery Case | అదనపు బాధ్యతలు

పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా నరసాపురంలో పని చేస్తున్న సురేష్​కుమార్​ భీమవరం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామానికి చెందిన బాజింకి ధనుంజయ అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ACB తెలిపింది. కాగా ఓ రైతు పొలంలోని టేకు చెట్టును ముక్కలుగా చేసినందుకు సామిల్లు సీజ్​ చేసినట్లు తెలిసింది. నిందితుడి నివాసం, కార్యాలయ ప్రాంగణంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. సాదు సురేష్ కుమార్ 2005లో అటవీ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధుల్లో చేరారు. 2011లో టైపిస్ట్‌గా పదోన్నతి పొందారు. 2016లో సెక్షన్ ఆఫీసర్‌గా ప్రమోషన్​ పొందారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

Road Safety Awareness Program | ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి : సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య...

Rakesh Reddy Comments | షబ్బీర్ అలీపై ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తొమ్మిదిసార్లు అవకాశమిస్తే ఏడుసార్లు ఓడిపోయిన షబ్బీర్​అలీ వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే కేవీఆర్​తో కలిసి మీడియాతో మాట్లాడారు.

Maoist Devji Surrenders | రాజకీయాల్లోకి వస్తా.. దేవ్​జీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Devji Surrenders | మావోయిస్ట్​ పార్టీ సెక్రెటరీ దేవ్​జీ అలియాస్ తిప్పిరి తిరుపతి (Thippiri Tirupati) మంగళవారం డీజీపీ...