Homeఆంధప్రదేశ్AP Government | డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం కొత్త ప‌థ‌కాలు.. ఒక్కో మ‌హిళ‌కు రూ.ల‌క్ష‌,...

AP Government | డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం కొత్త ప‌థ‌కాలు.. ఒక్కో మ‌హిళ‌కు రూ.ల‌క్ష‌, త్వ‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అండగా నిలిచే రెండు కీలక పథకాలను అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి (NTR Vidyalakshmi), ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి (NTR Kalyanalakshmi) పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా మహిళల పిల్లల విద్య, కుమార్తెల వివాహాల కోసం తక్కువ వడ్డీతో రుణాలు అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆమోదం తెలిపిన ఈ పథకాలు మరో పది రోజుల్లో అమల్లోకి రానున్నాయి.

AP Government | ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం..

  • డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు రుణ సహాయం
  • రూ.10,000 నుంచి గరిష్ఠంగా రూ.1,00,000 వరకు రుణం
  • పావలా వడ్డీ (4%) మాత్రమే
  • గరిష్ఠంగా 48 వాయిదాలలో చెల్లింపు
  • దరఖాస్తు చేసిన 48 గంటల్లో నేరుగా ఖాతాలో జమ
  • అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు, ఇన్‌స్టిట్యూట్ రసీదు సమర్పణ తప్పనిసరి
  • గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువులకు వర్తింపు

AP Government | ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం

  • డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లి ఖర్చులకు రుణం
  • రూ.10,000 నుంచి గరిష్ఠంగా రూ.1,00,000 వరకు సహాయం
  • పావలా వడ్డీ (4%)
  • గరిష్ఠంగా 48 వాయిదాలలో చెల్లింపు
  • లగ్నపత్రిక, ఈవెంట్ పత్రాలు, ఖర్చుల అంచనాలు సమర్పణ అవసరం
  • పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి ఖాతాలో నగదు జమ

AP Government | పథకాల ప్రత్యేకతలు ఏంటంటే..

  • సంవత్సరానికి రూ.2,000 కోట్లు ఖర్చు (ఒక్కో పథకానికి రూ.1,000 కోట్లు)
  • రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయంలో 50% డ్వాక్రా సంఘాల బలోపేతానికి, 50% స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు వినియోగం
  • రుణం తీసుకున్న సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే, రుణం పూర్తిగా మాఫీ చేస్తారు.

ఇలా ఈ రెండు పథకాలు డ్వాక్రా మహిళల కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, పిల్లల భవిష్యత్తుకు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఒక పెద్ద భరోసాగా నిలుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Must Read
Related News