Homeక్రైంTamil Nadu | పోలీసులే రాక్షసులుగా మారి దారుణం.. తమిళనాడులో ఆంధ్ర‌ యువతిపై అత్యాచారం

Tamil Nadu | పోలీసులే రాక్షసులుగా మారి దారుణం.. తమిళనాడులో ఆంధ్ర‌ యువతిపై అత్యాచారం

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Tamil Nadu | ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే (Police) రాక్షసులుగా మారిన ఘోర ఘటన తమిళనాడులో (Tamil nadu) వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆంధ్రప్రదేశ్‌కు (Andhra pradesh) చెందిన లక్ష్మి (18) అనే యువతి టమాటాలు రవాణా చేస్తున్న గూడ్స్ వాహనంలో సోమవారం రాత్రి ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో తిరువణ్ణామలై జిల్లా (Tiruvannamalai district) ఎంథాల్ బైపాస్ వద్ద సుందర్, సురేశ్ రాజ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాన్ని ఆపారు. వాహనంలో ఉన్న యువతిపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ పేరుతో ఆమెను బలవంతంగా కిందకు దించారు.

Tamil Nadu | అమానుషం..

తరువాత ఆమెను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి, పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు వినిపించడంతో సమీపంలో ఉన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. కానిస్టేబుళ్లు (Constables) వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలిని స్థానికులు అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ ఘటనపై ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసి, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ప్రజల భద్రతను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి అమానుష ఘటనలకు పాల్పడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని (Punish) స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌నలు చూశాక స‌మాజం అస‌లు ఎటు పోతుందో అంటూ చాలా మంది ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రోజు రోజుకి మ‌నుషులు ఎందుకు ఇంత ప‌శువుల మాదిరిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.