అక్షరటుడే, హైదరాబాద్: Andesri | ప్రముఖ కవి, రచయిత తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయహే తెలంగాణ సృష్టికర్త అందెశ్రీ(64) ఇక లేరు. ఈ రోజు ఉదయం మరణించారు.
అందెశ్రీ నవంబర్ 10 తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారి తన ఇంట్లో కుప్పకూలారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అందెశ్రీ ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రి Gandhi Hospital కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు.
Andesri | నంది అవార్డుతోపాటు పలు పురస్కారాలు..
అందెశ్రీ 1960లో నల్లగొండ జిల్లా Nalgonda district లో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లన్న. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని Telangana state anthem రచించారు. 2006లో వచ్చిన ‘గంగ’ ‘Ganga సినిమాతో అందెశ్రీకి నంది పురస్కారం వరించింది.
2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ నుంచి అందశ్రీ గ్లోబల్ పీస్ డాక్టరేట్ Global Peace Doctorate పొందారు. 2015లో దాశరథి సాహితి పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితి పురస్కారం పొందారు.
1 comment
[…] […]
Comments are closed.