- Advertisement -
Homeఆంధప్రదేశ్Anchor Shyamala | బాలకృష్ణపై యాంకర్ శ్యామల ఘాటు విమర్శలు.. విగ్గు, పెగ్గు కాదు.. సిగ్గుండాలి

Anchor Shyamala | బాలకృష్ణపై యాంకర్ శ్యామల ఘాటు విమర్శలు.. విగ్గు, పెగ్గు కాదు.. సిగ్గుండాలి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anchor Shyamala | టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి “సైకో గాడు” అంటూ బాలకృష్ణ(TDP MLA Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమని ఆమె గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు.

రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం సరైంది కాదని ఆమె హెచ్చరించారు.బాలకృష్ణకు గతంలో వైఎస్ కుటుంబం అండగా నిలిచిందని గుర్తు చేసిన శ్యామల(Anchor Shyamala), “మీ ఇంట్లో కాల్పుల ఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆ కేసు నుంచి కాపాడింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ విషయం ఇలా మరిచిపోవచ్చా?” అంటూ ప్రశ్నించారు.

- Advertisement -

ఆపదలో తోడుగా నిలిచిన వారిని విమర్శించడం తగదని వ్యాఖ్యానించారు. అలాగే, వైఎస్ జగన్ (YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సహాయం అందించారని శ్యామల వివరించారు. టీడీపీ పాలనలో పెండింగ్‌లో ఉన్న కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలను జగన్ గారి ప్రభుత్వమే విడుదల చేసింది. ఆ విషయం మీకు గుర్తులేదా?” అని ఆమె నిలదీశారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్యామల, “నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు, ఒంటికి కొంచెం సిగ్గు కూడా ఉండాలి అంటూ మాట‌ల‌ దాడి చేశారు. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

శ్యామ‌ల చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇక‌ అసెంబ్లీలో బాలకృష్ణ.. చిరంజీవిపై కూడా కామెంట్స్ చేయ‌గా, దానికి చిరు వెంట‌నే స్పందించాడు. అప్పటి సీఎం జగన్‌ ఆహ్వానం మేరకే మేము అంతా ఆయన నివాసానికి వెళ్లా. ఆ స‌మ‌యంలో జ‌గన్ సాదరంగా ఆహ్వానించారు.అప్పుడు సినీ పరిశ్రమకి సంబంధించిన‌ ఇబ్బందులను జగన్‌కు వివరించా. సమయం వస్తే అందరం కలిసి వస్తామని చెప్ప‌గా, అప్పుడు కోవిడ్ పరిస్థితుల‌ వల్ల కేవ‌లం ఐదుగురే రావాలని చెప్పారు.అయితే నేను 10 మంది వస్తామని చెప్పాను. దానికి జగన్ సరేనన్నారు. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాక‌పోవ‌డంతో మేము వెళ్లాం అని చిరు అన్నారు

- Advertisement -
- Advertisement -
Must Read
Related News