
అక్షరటుడే, వెబ్డెస్క్: Super Serial Championship | జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ చివరి దశకు వచ్చింది. ఆదివారం (మే 11)న ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఫినాలేకి రోజా (roja), మంచు లక్ష్మీ (manchu Lakshmi) గెస్ట్లుగా వచ్చారు. వారితో కలిసి యాంకర్ రవి (anchor ravi) తెగ సందడి చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని రవి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు (anchor ravi shared video on social media). ముందు యాంకర్ రవి, మంచు లక్ష్మి కలిసి మాస్ డ్యాన్స్ (anchor ravi and manchu lakshmi mass dance) వేశారు. ఆ తర్వాత రవి, రోజా కలిసి డ్యాన్స్ వేశారు. అనంతరం రవి, మంచు లక్ష్మి, రోజా ముగ్గురూ కలిసి డ్యాన్స్ వేశారు.
Super serial championship | ఏం డ్యాన్స్ ఇది..
దీంతో ఈ వీడియో వైరల్ కాగా మంచు లక్ష్మి ఈ రేంజ్ లో మాస్ డ్యాన్స్ (manchu lakshmi mass dance) వేసిందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. రవి వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్ లో పెట్టడంతో మరింత మాస్ గా డ్యాన్స్ వేసినట్టు అనిపిస్తుంది. దీంతో రోజా, మంచు లక్ష్మి డ్యాన్స్ లు (roja and manchu lakshmi dance) చూసి షాక్ అవుతున్నారు జనాలు. ఇక ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని కూడా వదిలారు. అటు రోజా ఇటు లక్ష్మి ఇద్దరికీ పోటీ కూడా పెట్టారు. మంచు లక్ష్మిని చూడగానే రోజా పెద్ద డైలాగ్ కొట్టేసింది. ఎండాకాలంలో ఏదైనా మంచు ప్రదేశానికి వెళ్దామనుకున్నా కాని ఇక్కడికి వచ్చేశా అంటూ రోజా అన్నారు. ఇక దీనికి అంతే దీటుగా మంచు అక్క కూడా డైలాగ్ కొట్టింది. పోటీలో ఎవరైనా కంచుగా ఉంటే బాగుంటుందని అనుకున్నా మీరు కలిశారు అంటూ మంచు లక్ష్మి (manchu lakshmi) చెప్పింది. ఈ మాటకి రోజా తెగ మురిసిపోయారు.
ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోగానే మంచు Vs కంచు (manchu vs kanchu)అంటూ ఓ పోటీ పెట్టేశారు. స్టేజ్ మీద బోరింగ్ పైప్ ఏర్పాటు చేసి బిందెలు నింపే పోటీ పెట్టారు. ఓవైపు రోజా, మరోవైపు మంచు అక్కా పోటాపోటీగా బోరింగ్ కొట్టి బిందెలు నింపారు. రోజాతో పోటీ పడటానికి మంచక్క గట్టిగానే ట్రై చేసింది. అయితే రోజాతో పోటీపడలేకపోతున్న మంచు లక్ష్మికి పక్క నుంచి యాంకర్ రవి (anchor ravi) హెల్ప్ చేశాడు. ప్రోమో (promo) అయితే అదిరిపోయింది. యాంకర్ రవి-అషూరెడ్డి (anchor ravi-Ashu Reddy) హోస్ట్ చేస్తున్న ఈ షోలో మొత్తం 16 జంటలు టైటిల్ కోసం పోటీ పడగా, చివరగా టైటిల్ గెలిచేది ఏ సీరియల్ టీమ్ (serial team) అనేది చూడాలి.
https://www.instagram.com/reel/DJbooAlSeeG/?utm_source=ig_web_copy_link