HomeజాతీయంMaharashtra | పరువు హత్య.. ప్రేమికుడి శవానికి తాళి కట్టిన యువతి, ర‌క్తంతో నుదుటిన సిందూరం

Maharashtra | పరువు హత్య.. ప్రేమికుడి శవానికి తాళి కట్టిన యువతి, ర‌క్తంతో నుదుటిన సిందూరం

మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన పరువు హత్య ఘటన దేశాన్ని కలచివేస్తోంది. యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిని హత్య చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra | మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన పరువు హత్య ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ప్రేమ పేరుతో ఇద్దరి హృదయాలు కలిశాయి, కానీ కులం అనే శాపం ఒక పువ్వులాంటి జీవితాన్ని చిదిమేసింది.

20 ఏళ్ల యువకుడిని కిరాతకంగా హతమార్చిన తరువాత అతడి నిర్జీవ దేహానికి తాళి కట్టి రక్తంతోనే సిందూరం పెట్టుకున్న అంచల్ మామిల్వార్ (21) అంద‌రిని శోక‌సంద్రంలోకి నెట్టింది. నాందేడ్‌ (Nanded)కు చెందిన అంచల్‌ మరియు సాక్షం తాటే మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఒక్కటై జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అయితే సాక్షం SC కులానికి చెందినవాడని తెలిసి, అంచల్ కుటుంబం వారి ప్రేమకు అడ్డుపడింది. పరువు అనే పేరుతో చివరకు ప్రాణాలను బలి తీసుకుంది.

Maharashtra | తండ్రి–సోదరులే హంతకులు

గురువారం సాయంత్రం అంచల్ తండ్రి, ఇద్దరు సోదరులు, పలు బంధువులు కలిసి సాక్షంపై దాడి చేశారు.తుపాకీతో కాల్చి, బండరాళ్లతో తలపై కొట్టి పాశవికంగా హత్య చేశారు. ఈ దారుణం నాందేడ్‌ను మాత్రమే కాదు, దేశాన్ని కూడా కుదిపేసింది.సాక్షం అంత్యక్రియల సమయంలో కన్నీటి పర్యంతమైన అంచల్ చేసిన ఆరోపణలు ఇప్పుడు వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నిస్తున్నాయి. “ఉదయం మా అన్న నన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్‌ (Police Station)కు తీసుకెళ్లాడు.సాక్షంపై తప్పుడు కేసు పెట్టమన్నారు. నేను అంగీకరించలేదు.అప్పుడు పోలీసులు ‘కేసులు ఎందుకు? వాడిని లేపేసి రండి’ అన్నారు. ఆ మాటలకే రెచ్చిపోయి… నా కళ్ల ఎదుటే నా ప్రాణాన్ని చంపేశారు అని పేర్కొంది. ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసుల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షం మృతదేహం వద్దకు చేరుకున్న అంచల్, అతడి శరీరాన్ని హత్తుకుని కన్నీరుమున్నీరైంది. తరువాత అతడి శవానికి తాళి కట్టి, అతని రక్తంతోనే తన పాపిటలో సిందూరం పెట్టుకుంది. ఆమె శపథం విన్న ప్రతీ హృదయం ముక్కలైంది. ఇప్పటి నుంచి నేను సాక్షం భార్యనే. అతడి కుటుంబంతోనే ఉంటాను. నా తల్లిదండ్రులు, నా సోదరులు వారే నా ప్రాణాన్ని చంపారు. వారిని ఉరితీయించే వరకు పోరాటం కొనసాగిస్తాను. అని పేర్కొంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం (SC/ST Atrocities Act) కింద మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే అంచల్ చేసిన ఆరోపణల కారణంగా కేసు దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Must Read
Related News