Anasuya
Anasuya | నా భ‌ర్తకి షార్ట్ టెంప‌ర్ ఎక్కువ‌.. పెళ్లి కాక‌పోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని : అన‌సూయ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anasuya Bharadwaj | అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 15 మే 1985న జన్మించిన అనసూయ Anasuya హైదరాబాద్‌లోని భద్రుక కాలేజీ నుంచి 2008లో ఎంబీఏ పట్టా పొంది అనంత‌రం కొన్నాళ్లు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. ఆ త‌ర్వాత న్యూస్ ఛానెల్‌ సాక్షిలో న్యూస్ రీడర్‌గా పనిచేశారు. కాలేజీ చదువుతున్న సమయంలోనే నాగ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఇక న్యూస్ రీడర్​గా పనిచేస్తున్న అనసూయ మా మ్యూజిక్ వంటి ఛానళ్లకు యాంకర్ గా వ్యవహరించారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈమె యాంకర్​గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత న‌టిగా రంగస్థలం సినిమా ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది ఈ సినిమాలో గుర్తింపు పొందిన అనసూయ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆదరణ పొందారు.

Anasuya | అలా అనేసింది ఏంటి?

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవ‌ల అనసూయ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ ఇంటికి శ్రీరామ సంజీవని(Sri Rama Sanjeevani) అని పేరు కూడా పెట్టుకున్నారు. తన సంపాదనను తెలివిగా పలు కంపెనీల్లో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడంతో ఈమె ఆస్తులు భారీగా పెరిగాయని చెప్పాలి.. ఇక అన‌సూయ ఓ బుల్లితెర షోలో ఆస‌క్తికర కామెంట్స్ చేసింది. యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న టీవీ షోకి అనసూయ అతిథిగా హాజరైంది. అనసూయకు టాస్క్ ఇచ్చి అందులో అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. లేకుంటే పచ్చి మిరపకాయ తినాల్సి వస్తుంది అని యాంకర్ రవి, శ్రీముఖి అంటారు. అనసూయ ఛాలెంజ్ ని Challenge యాక్సెప్ట్ చేసింది. రవి ప్రశ్నిస్తూ మీకు ఒకవేళ పెళ్లి కాకుంటే టాలీవుడ్​లో ఏ హీరోతో డేటింగ్ చేసేవాళ్లు అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ ఏమాత్రం ఆలోచించకుండా రాంచరణ్ అని సమాధానం ఇచ్చింది.

రంగస్థలం చిత్రంలో అన‌సూయ‌.. రామ్ చ‌ర‌ణ్‌(Ram Charan)తో క‌లిసి నటించిన సంగతి తెలిసిందే. ఇక తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్తలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ క్వాలిటీ షార్ట్ టెంపర్ అని, అది త‌ప్పితే తన భర్త మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రశంసించింది. అంతే కాకుండా తన పేరు గురించి కూడా అనసూయ ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. మొదట తన తల్లి తనకి పవిత్ర Pavitra అనే పేరు పెట్టాలనుకోగా, అప్ప‌టి నుండి పవిత్ర అనే పేరు కూడా తనకిష్టమని అనసూయ తెలిపింది.