అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Anasuya Bharadwaj | యాంకర్‌గా బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన అనసూయ Anasuya ఇప్పుడు నటిగా కూడా రాణిస్తుంది. సినిమాలు, టీవీ షోస్, ఈవెంట్స్, సోషల్ మీడియా ఇలా పలు రకాలుగా అనసూయ బాగానే సంపాదిస్తుంది. పుష్ప 2 తరువాత అనసూయ పేపర్ బాయ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ‘అరి’(Ari)అనే సినిమాలో నటించింది కానీ.. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం అనసూయ.. స్టార్ మా ఛానల్‌లో ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2’లో మెంటర్‌గా కనిపిస్తుంది. అనసూయ ఒక్కసారి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి వెళ్లిందంటే.. రూ.10 నుంచి రూ.15 లక్షల వరకూ చార్జ్ చేస్తుందట . అంత చార్జ్ చేస్తున్నా కూడా అనసూయకి డిమాండ్ మాములుగా ఉండదు. అయితే అనసూయ లేటెస్టుగా హైదరాబాద్(Hyderabad) లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది.
Anasuya Bharadwaj | క్రేజీ కామెంట్..
సోమవారం తన ఫ్యామిలీతో కలిసి కొత్తింటిలోకి అడుగుపెట్టింది. తన ఇంటికి ‘శ్రీరామ సంజీవని'(Srirama Sanjeevani) అనే పేరు పెట్టింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది.”ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో.. మా జీవితంలోని మరో అధ్యాయం.. శ్రీరామ సంజీవని.. మా కొత్తింటి పేరు.. జై శ్రీరామ్.. జై హనుమాన్” అని అనసూయ పేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో అనసూయ, సుశాంక్ భరద్వాజ్ దంపతులు పూజా Pooja కార్యక్రమాలు నిర్వహించి, నూతన గృహంలోకి అడుగు పెట్టినట్లు కనిపిస్తోంది.
తెలుగు సాంప్రదాయం ప్రకారం కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి ఏమేమి కార్యక్రమాలు చేస్తారో, అవన్నీ అనసూయ(Anasuya) చేసింది. గోమాతను ఇంట్లోకి తీసుకురావడం, పాలు పొంగించడం, పూజలు చేయడం, తన భర్తతో కలిసి దేవుళ్ల పాటలతో ఇంట్లోకి ప్రవేశించడం వంటివి చేసింది. అయితే అనసూయ ఫొటోలకి కొందరు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ కొత్త ఇంటిపై సింగర్, నటి సమీరా భరద్వాజ్ sameera ఫన్నీగా కామెంట్ చేసింది. అది భరద్వాజ్ ఇల్లే కదా.. అంటే నాకు కూడా వాటా ఉంటుందా? అని సమీరా భరద్వాజ్ కామెంట్ పెట్టింది. ఈ కామెంట్‌కు అనసూయ రియాక్ట్ అయింది. అవును ఉంది.. అంతా మనదే.. వచ్చేయ్ అని రిప్లై ఇచ్చింది. కంగ్రాట్స్ అనసూయ గారు అని స్రవంతి కామెంట్ చేసింది. కంగ్రాట్స్ అను, నిక్కు, శౌరు, అయాన్ష్ అని శ్రీముఖి విష్ చేసింది.