అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anasuya Bharadwaj | ప్రముఖ టెలివిజన్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ తాజాగా ఓ సంఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తన ఆగ్రహాన్ని చాటారు. మార్కాపురంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి అనసూయ (Anasuya Bharadwaj) వెళ్లగా అక్కడ కొంతమంది యువకులు అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని సమాచారం. ఆమెను చూసి చీప్ కామెంట్లు చేయడంతో అనసూయ కోపం కట్టలు తెంచుకుంది. చెప్పు తెగుద్ది అంటూ వార్నింగ్(Warning) ఇచ్చింది.
‘‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. మీ వలన సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎలా తయారవుతారో అంటూ మండిపడింది. మీ ఇంట్లో మీ చెల్లి, తల్లి, పెళ్లాలని ఇలా అంటే మీకు నచ్చుతుందా’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది అనసూయ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Anasuya Bharadwaj | కోపం తెప్పించారు..
‘మీ బుద్ధి చూసి ఆశ్చర్యంగా ఉంది. పబ్లిక్ ప్లేస్‌లో అమ్మాయిలను చూసి రకరకాలుగా మాట్లాడడం గొప్పతనమా? మీరు సిగ్గుపడాలి. మీరు చేస్తున్న పనులతో సమాజానికి ఏ ఉపయోగమూ లేదు’ అంటూ కామెంట్స్ చేసింది. అనసూయ చాలా ఓపెన్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఏ విషయంపైనైనా చాలా స్ట్రెయిట్‌గా మాట్లాడుతుంది. తనని ఎవరన్నా ఏమైనా అన్నా కూడా వెంటనే రెస్పాండ్ అవుతుంది. మీ అందరి కోసం ఏడు గంటలు ప్రయాణించి వస్తే ఇలా చేస్తారా అంటూ కాస్త అసహనం వ్యక్తం చేసింది అనసూయ.
ఇక యాంకర్‌గా (Anchor) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ రంగస్థలం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా విజయంతో అనుసూయకు అవకాశాలు వరుస కట్టాయి. తాజాగా వచ్చిన పుష్ప చిత్రంలో కూడా అనసూయ దాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది.. వరుస సినిమాలు చేస్తూనే.. టీవీ షోలలో కూడా సందడి చేస్తుంది అనసూయ. ఇక ఏ విషయం గురించి అయినా సరే ముక్కుసూటిగా.. కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడడం అనసూయ నైజం. దాంతో ఆమె తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఆ మధ్య హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తోనూ ఆమె ఫైట్ చేసింది.
View this post on Instagram