అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anasuya Bharadwaj | తెలుగు బుల్లితెరపై తనదైన మార్కుతో గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ మాజీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) ఎప్పటిలాగే సోషల్‌మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంది. తరచూ తన గ్లామరస్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్న అనసూయ, ఈసారి నెదర్లాండ్ వెకేషన్(Netherlands Vacation) ఫోటోలతో ఆకట్టుకుంటోంది.
తాజాగా నెదర్లాండ్‌కి ఒంటరిగా వెళ్తూ సముద్రతీరాల్లో విహరిస్తున్న అనసూయ అక్కడి బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేయగా, అవి కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. బోటులో చిలిపి ఫోజులు, రోడ్లపై స్వేచ్ఛగా సంచరించడం, వెకేషన్ మూడ్‌లో ఐస్ క్రీమ్, స్ట్రీట్ ఫుడ్‌తో ఎంజాయ్ చేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Anasuya Bharadwaj | పాపం అనసూయ..
అనసూయ ప్రస్తుతం సినిమాలకంటే ఎక్కువగా టెలివిజన్ షోలపై దృష్టి పెట్టింది. ఇటీవల “కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్” షోలో జడ్జిగా వ్యవహరించిన ఆమె, పలు ఈవెంట్లు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌లోనూ పాల్గొంటోంది. గతంలో జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి స్పందిస్తూ పలు సందర్భాల్లో విమర్శకులకు గట్టి కౌంటర్లు ఇచ్చిన అనసూయ, తనపై వచ్చిన అభ్యంతరకర కామెంట్లు పిల్లలపై ప్రభావం చూపుతాయన్న కారణంతో కొన్ని టీవీ ప్రోగ్రామ్‌ల నుంచి తప్పుకుంది. అయితే ఇప్పుడు అనసూయ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అధికారికంగా ఏ మూవీ ప్రకటన రాకపోవడంతో ఈ భామకి సినిమా ఆఫర్లు కూడా కి తగ్గాయా అనే వాదన వినిపిస్తుంది.
మరోవైపు ఇప్పుడు మరోసారి బుల్లితెరపైనే ఎక్కువగా సందడి చేస్తుంది. మొన్నటి వరకు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో మెరిసిన ఈ భామ ఇందులో జడ్జ్ గా వ్యవహరించింది. దీంతోపాటు పలు ఇతర షోస్ లో మెరుస్తోంది. ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది . అయితే ప్రస్తుతం ఆమె చేతిలో కొత్తగా ఎలాంటి సినిమా ప్రాజెక్టులు లేవన్న వార్తల మధ్య, బుల్లితెరపై మళ్లీ జోరు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియాలో తన చిలిపితనంతో ఎప్పటికప్పుడు సందడి చేసే అనసూయ… వెకేషన్ ఫోటోలతో మరోసారి తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చాటుతోంది.