HomeసినిమాAnanya Pandey | మా అమ్మ చేసే ప‌నుల‌కు నేను స్నానం చేయ‌లేద‌ని అనుకుంటారు.. లైగ‌ర్...

Ananya Pandey | మా అమ్మ చేసే ప‌నుల‌కు నేను స్నానం చేయ‌లేద‌ని అనుకుంటారు.. లైగ‌ర్ బ్యూటీ కామెంట్స్ వైర‌ల్

ఈ రోజు అన‌న్య పాండే బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అమ్మ ఇచ్చే నజర్ రక్షణ అనన్యకు ఇప్పుడు అదృష్టం తెస్తోందని అభిమానులు చెబుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ananya Pandey | బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా పేరొందిన అనన్య పాండే ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన స్టార్ కిడ్. ఆమె తండ్రి చుంకీ పాండే బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య, పెద్దగా హిట్ సినిమాలు లేకపోయినా స్టార్ రేంజ్‌లో ఆస్తులు సంపాదించింది. ముంబైలో సొంత అపార్ట్‌మెంట్ కొనడం అనన్య (Ananya Pandey) కెరీర్‌లో పెద్ద మైలురాయిగా మారింది. గౌరీ ఖాన్ డిజైన్ చేసిన ఈ ఇల్లు అనన్య స్టైల్, అభిరుచిని ప్రతిబింబిస్తుంది. కేవలం 26 ఏళ్లకే సొంత ఇల్లు క‌లిగి ఉండ‌డం ఆమె విజయాన్ని చూపిస్తోంది.

అనన్య పాండేకు లగ్జరీ కార్లంటే (Luxury Cars) చాలా ఇష్టం. ఆమె కార్ కలెక్షన్‌లో రూ.1.70 కోట్ల విలువైన BMW 7 సిరీస్, అలాగే రూ. 1.64 కోట్ల నుంచి రూ.1.84 కోట్ల మధ్య విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఉన్నాయి. ముంబై వీధుల్లో ఈ కార్లలో డ్రైవ్ చేయడం ఆమెకు లగ్జరీ అనుభవం అందిస్తుంది. అనన్య పాండే లైగర్ చిత్రంతో (Liger Movie) టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయింది. అయితే ఈ రోజు (అక్టోబర్ 30) బాలీవుడ్ నటి అనన్య పాండే తన 27వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ప్రస్తుతం ఆమె కెరీర్ మంచి దూకుడు మీద ఉంది.

అయితే ఆమె కెరీర్‌తో పాటు, అనన్య త‌ల్లి భావ‌నా పాండే చేసే ఒక ప్రత్యేక పద్ధతి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) చర్చనీయాంశమైంది. ఒక నెట్‌ఫ్లిక్స్ వీడియోలో అనన్య మాట్లాడుతూ.. “మా అమ్మ ప్రతిరోజూ నా చెవుల వెనుక రెండు నల్ల బొట్లు పెడుతుంది. అది నజర్ దోషం రాకుండా ఉండడానికి. కానీ అందరూ నేను స్నానం చేయలేదని అనుకుంటారు!” అని నవ్వుతూ చెప్పింది. అంతే కాదు, ఆమె ప్రతి వారం ఒకసారి ‘మిర్చీ టోటకా’ కూడా చేస్తుంది. “మా ఇంట్లో పనిచేసే వ్యక్తి మిర్చీలతో నజర్ తీయడం చేస్తుంది. మిర్చీ వాసన ఎక్కువగా వస్తే లేదా ఎక్కువగా కాలిపోతే, అప్పుడు నజర్ ఉంది అని అర్థం!” అని అనన్య చెప్పింది. ప్రస్తుతం అనన్య పాండే తూ మేరీ మైన్ తేరా సినిమాలో కార్తిక్ ఆర్యన్‌తో నటిస్తోంది. ఈ సినిమా 2025 డిసెంబర్ 31న విడుదల కానుంది. అలాగే చంద్ మేరా దిల్ అనే రొమాంటిక్ డ్రామాలో లక్ష్యతో కలిసి నటిస్తోంది. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.