ePaper
More
    HomeసినిమాHeroine Anantika | ఈ హీరోయిన్ ఒక్క వీడియోతో అందరి మైండ్ బ్లాక్ చేసేసిందిగా..!

    Heroine Anantika | ఈ హీరోయిన్ ఒక్క వీడియోతో అందరి మైండ్ బ్లాక్ చేసేసిందిగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Heroine Anantika | హీరోయిన్ అంటే గ్లామర్ లుక్స్.. ఫిట్నెస్, యాక్టింగ్ మాత్రమే అని అనుకుంటారు. కానీ ఈ అమ్మడిని చూస్తే అంత‌కు మించి అన్న‌ట్టుగా ఉంది.

    ఈ హీరోయిన్ టాలెంట్ చూసి మేకర్స్, జనాలు సైతం అవాక్కవుతున్నారు. ‘మ్యాడ్’ MAD చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతిక‌ (Heroine Anantika) సునీల్‌కుమార్.. తాజాగా ‘8 వసంతాలు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మాతలుగా ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన చిత్రంతో ఈ నెల 20న ప‌ల‌క‌రించేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం లవ్, మార్షల్‌ ఆర్ట్స్‌ ఇతివృత్తంగా రూపొందింది.

    Heroine Anantika | ఇంత టాలెంటా మ‌రీ..

    గ‌త కొద్ది రోజులుగా మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనంతిక‌ తన మల్టీ టాలెంట్స్‌ని అందరి ముందూ ప్రదర్శించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 19 సంవత్సరాలు మాత్ర‌మే. ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన అనంతిక‌.. ప్రస్తుతం లాయర్ కోర్సు చేస్తుంది. అలాగే చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ (Classical Dance) నేర్చుకుంది.

    అంతేకాకుండా కరాటేలో ఆమెకు బ్లాక్ బెల్ట్ ఉంది. కేరళకు చెందిన కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ సైతం నేర్చుకుంది. కత్తి ఫైటింగ్ లోనూ ఆమె సిద్ధహస్తురాలే.. ఇవే కాకుండా కేరళ సంప్రదాయంలోని చెండా (డ్రమ్స్) సైతం వాయిస్తుంది. కేవలం ఒకటి కాకుండా అనేక రంగాల్లో అనంతిక ప్రతిభావంతురాలు. నటిగానే కాకుండా డ్యాన్సర్‌గానూ సత్తా చాటుకుంటోంది. క్లాసికల్ డ్యాన్స్ నుంచి వెస్ట్రన్ స్టైల్ వరకు ఎలాంటి డ్యాన్స్ అయినా మంచి ఈజ్‌తో చేసేస్తుంది.

    ఆమెలో ఓ మంచి సింగర్ కూడా ఉంది. పాటలు పాడుతూ సోషల్‌మీడియాలో ఆమె పెట్టే వీడియోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ‘8 వసంతాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనలోని అన్ని టాలెంట్స్‌ని వేదిక మీద చేసి చూపించింది అనంతిక‌ (Heroine Ananthika).

    కేవలం 19 ఏళ్ల వయసులోనే ఇంత పరిణితిని కనబరుస్తోన్న ఆమెను చూసి ఈవెంట్‌కి హాజరైన అతిథులంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ‘క్లాసికల్ డ్యాన్సర్, కరాటేలో బ్లాక్ బెల్ట్, కలరియపట్టులో ప్రావీణ్యం, కత్తి విద్యలోనూ అనుభవం. హీరోయిన్, లా స్టూడెంట్.. ఇవన్నీ 19 ఏళ్ల వయసులోనే’.. అంటూ నెటిజన్లు ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ‘8 వసంతాలు’ (8 Vasanthalu movie) ‘సినిమాలోని హీరోయిన్‌ పాత్ర కోసం దేశం మొత్తం వెతికితే క్లాసికల్‌ డ్యాన్స్‌తో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ వచ్చిన ఒకే ఒక్క అమ్మాయి అనంతిక రూపంలో కనిపించింది’ అని నిర్మాత ర‌విశంక‌ర్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...