అక్షరటుడే, దుండిగల్: Dundigal | అనఘాదేవి వ్రతంతో అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని.. భక్తుల బాధలు తొలగిపోవాలని అర్చకులు సుధీర్ శర్మ, లక్ష్మీనరసింహమూర్తి పేర్కొన్నారు. దుండిగల్ అవధూత శ్రీదత్తపీఠంలో (Avadhuta Sri Dattapeetham) మార్గశిర బహుళ అష్టమి అనఘాష్టమి సందర్భంగా శుక్రవారం అనఘాష్టమి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దత్తాత్రేయుడి భార్య అనఘాదేవి (దుర్గ,లక్ష్మి,సరస్వతి దేవి) పుట్టిన రోజు సందర్భంగా బహుళ శుద్ద అష్టమి రోజు ఆలయంలో అనఘాష్టమి వ్రతం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు అష్టాదశ కలశాలతో పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు సుధీర్ శర్మ, లక్ష్మీ నరసింహమూర్తి (Lakshmi Narasimha Murthy) ఆధ్వర్యంలో వ్రత విశేషాన్ని భక్తులకు తెలియజేశారు.
Dundigal | అనఘము అంటే పాపాలను నశింపజేయడం..
అనఘము అంటే మూడు రకాల పాపాలను నశింపజేయడమని భక్తులకు అర్చకులు వివరించారు. అనఘాస్టమి వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశిర్షమాస కృష్ణపక్ష అష్టమి (Krishna Paksha Ashtam) అని ఈ రోజున ప్రతిఏడాది ఈ వ్రతం చేయడం చాలా మంచిదని వారు పేర్కొన్నారు. అలాగే ప్రతినెలా కృష్ణపక్ష బహుళ అష్టమి రోజు కుడా చేయవచ్చని తెలియజేశారు. ఈ వ్రతం ప్రతిఏడాది నిర్వహించుకునే వారు మూడురకాల పాపాలు తొలగి ‘అనఘులు’గా అవుతారు. అందుకే ఈ వ్రతాన్ని ‘అనఘాస్టమి వ్రతం’ అంటారని అర్చకులు సుధీర్ శర్మ, లక్ష్మీనరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా భారీసంఖ్యలో తరలివచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద వితరణ చేశారు.

