అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Anaganaga Movie Review | సుమంత్ కుమార్ Sumanth Kumar లీడ్ రోల్ లో రిలీజైన చిత్రం అనగనగా. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. మే 15 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ సన్నీ సంజయ్ అందరికీ కనెక్ట్ అయ్యే కథని హార్ట్ టచ్చింగ్ గా ప్రజెంట్ చేయగా, ఇది ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూద్దాం..
Anaganaga Movie Review | కథ:
వ్యాస్(సుమంత్) ఇంటర్నేషనల్ స్కూల్(International School) లో పర్సనల్ డెవలప్‌మెంట్ టీచర్. ఆయన ర్యాంకుల పేరుతో చిన్న పిల్లలని ఒత్తిడి చేయవద్దని స్కూల్ యాజమాన్యంతో పాటు తోటి ఉపాధ్యాయులతో గొడవలు పడుతుంటాడు. పాఠాలను కథల రూపంలో వివరిస్తే వారికి మంచిగా ఎక్కుతుందని అంటాడు. ఇక భార్య భాగ్య( కాజల్ చౌదరి) ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన మేనేజ్‌మెంట్ చెప్పినట్టు విని భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. వ్యాస్ మాటలు లెక్కచేయకపోగా, అతడిని ఉద్యోగం నుండి తొలగిస్తుంది. ఆ తర్వాత చదువులో వెనకబడిపోతున్న చిన్నారుల కోసం వ్యాస్ ఏం చేశాడు? భార్య తప్పు తెలుసుకుందా? అన్నది మిగతా కథ.
Anaganaga Movie Review | నటీనటుల పర్‌ఫార్మెన్స్:
క్లాసిక్ సినిమాలలో సుమంత్(Sumanth) ఎలా ఒదిగిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాస్ సర్ పాత్రలో తన నటనతో ఎంతగానో మెప్పించాడు. ఆయన భార్య పాత్రలో కాజల్ చౌదరి(Kajal Chaudhary) కూడా చక్కగా నటించింది. చీరకట్టులో అందంగా ఉంది. రామ్ గా మాస్టర్ విహర్ష్(Master Viharsh) పతాక సన్నివేశాలలో ఎంతో అలరించారు. అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేష్ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది తమ పాత్రలలో అద్భుతంగా నటించారు.
Anaganaga Movie Review | టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనం అయ్యేలా చేస్తుంది. తక్కువ లొకేషన్‌లో ప్రతి ఫ్రేమ్‌ని పవన్ చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ కాస్త పని చెబితే బాగుండేది. ద్వితీయార్ధంలో కొన్నింటికి కత్తెర పడాల్సి ఉంది. దర్శకుడు సన్నీ సంజయ్ తాను ఎంచుకున్న కథ, తెరపై చూపించిన విధానం బాగుంది. ఇప్పటికే విద్యావస్థ లోపాలకి సంబంధించి అనేక సినిమాలు వచ్చిన తెలుగు నేటివిటీకి అనుగుణంగా అనగనగా బాగా తీసారు. పాటలు కూడా బాగున్నాయి.
చిత్రం: అనగనగా
నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, కౌముది నేమాని తదితరులు
సంగీతం: చందు రవి
సినిమాటోగ్రఫీ: పవన్ పప్పుల
రచన, దర్శకత్వం: సన్నీ సంజయ్
స్ట్రీమింగ్ వేదిక: ఈటీవీ విన్
ప్లస్ పాయింట్స్:
సుమంత్, ఇతర నటీనటులు
ప్రథమార్ధం
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్
Anaganaga Movie Review | విశ్లేషణ:
నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలని రూ. లక్షల్లో ఫీజులు చెల్లిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. నేటి విద్యావ్యవస్థ, దాని తీరు తెన్నులని ప్రశ్నిస్తూ.. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చూపించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చిన్నారిని తల్లిదండ్రులు సైకలాజిస్టు(Psychologist) దగ్గరకి తీసుకొచ్చే సన్నివేశంతోనే దర్శకుడు మనకు ఏ కథ చెప్పబోతున్నాడనేది అర్ధమవుతుంది. తమ పాఠశాల పేరును కాపాడుకునేందుకు ఎగ్జామ్స్ పాస్ కావాలని పిల్లలపై ఒత్తిడి తేవడం, చదవని పిల్లలను ఫెయిల్యూర్ అంటూ బ్యాడ్జ్‌లు ఇచ్చి అవమానించడం నేటి పరిస్థితులకి అద్ధం పడుతుంది. విరామానికి ముందు దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడిని ఎమోషనల్ డ్రామా వైపు తీసుకెళుతుంది. ద్వితీయార్ధంలో తండ్రి కొడుకుల భావోద్వేగాల ప్రయాణంగా సాగుతుంది. ఎడ్యుఫెస్ట్‌లో వ్యాస్ కొడుకు చెప్పే కథ గుండెలకి హత్తుకుంటూ కథని ముగించిన తీరు బాగుంది. ఫైనల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.
రేటింగ్ : 3/5
