అక్షరటుడే, నిజాంసాగర్: Alumni Students | మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School)లో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 2007–08 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్కచోట కలుసుకున్నారు. తమ చిన్ననాటి మిత్రులతో కలిసి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. రోజంతా ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు.