అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Sudarshan Reddy | రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (Mla Sudarshan reddy) పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రత్యేక సలహాదారుడిగా నియమితులైన తర్వాత నిజామాబాద్‌కు వచ్చిన సందర్భంగా పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎన్ఎస్యూఐ (NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ (Venu raj) మంగళవారం సుదర్శన్ రెడ్డిని కలిశారు. సుదర్శన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రభుత్వ పథకాల ప్రత్యేక సలహాదారుడిగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) కృతజ్ఞతలు తెలియజేశారు.
