అక్షరటుడే, బోధన్ : Bodhan Municipality | సాక్షాత్తు బోధన్ మున్సిపల్ కార్యాలయంలోనే ఉద్యోగులు కొట్టుకున్న ఘటనను ‘అక్షరటుడే’ (Akshara Today) వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘మున్సిపల్ కార్యాలయంలోనే కొట్టుకున్న ఉద్యోగులు’ శీర్షికతో కథనం ప్రచురితం కాగా.. దీనిపై జిల్లా ఉన్నాధికారులు స్పందించారు.
బల్దియాలోనే ఉద్యోగులు తగువులాడడంపై ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy) సైతం సీరియస్ అయినట్లుగా తెలిసింది. దీనిపై విచారించాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్‌ను (Additional Collector Ankit) పురమాయించినట్లుగా సమాచారం. దీనిపై శుక్రవారం ఆయన పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. మున్సిపల్ రికార్డులతో పాటు ఉద్యోగులు కొట్టుకున్న ఘటనపై కూడా విచారణ చేపట్టారు.
Bodhan Municipality | ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు..!
ఉద్యోగులు కొట్టుకున్న ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు (Showcause Notices) జారీ చేసినట్లుగా సమాచారం. వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని వారికి సూచించినట్లుగా తెలిసింది. దీనిపై సంతృప్తి చెందని పక్షంలో వారిని సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.